ఆ చిత్రం బిల్గేట్స్ ను ఆకట్టుకుంది..!

 బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథ' తనను ఎంతగానో ఆకట్టుకుందని ట్విట్టర్ ద్వారా చెప్పారు.

Last Updated : Dec 20, 2017, 12:37 PM IST
ఆ చిత్రం బిల్గేట్స్ ను ఆకట్టుకుంది..!

బిల్గేట్స్, వారెన్ బఫెట్, ముఖేష్ అంబానీ, జుకన్ బర్గ్... వీళ్ళందరూ సినిమాలు చూస్తారా? చూస్తే ఎలాంటి సినిమాలు  చూస్తారు? యాక్షనా?థ్రిల్లరా? రొమంటికా? అని మీరెప్పుడైనా ఆలోచించారా? వారికి ఏ సినిమా నచ్చిందో తెలుసా?

తాజాగా బిల్గెట్స్ తనకు బాలీవుడ్ లో ఒక సినిమా నచ్చిందని చెప్పారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథ' తనను ఎంతగానో ఆకట్టుకుందని ట్విట్టర్ ద్వారా చెప్పారు. ఇందులో హీరోయిన్ భూమి పెడ్నేకర్. శ్రీ నారాయణ్ సింగ్ డైరెక్టర్. అక్షయ్ కుమార్ ఈ చిత్రాన్ని నీరజ్ పాండే తో కలిసి నిర్మించారు.  

 

ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ.. 'టాయ్ లెట్ నిజజీవితంలో జరిగే సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను జనాలకు తెలిపి మేల్కొనేలా చేశారు. భారత పారిశుధ్య సవాళ్ల గురించి ప్రేక్షకులకు తెలిపారు" అన్నారు.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి విషయం తెలిసిందే.. ! 

 

Trending News