బిగ్ బాస్ 12 సీజన్ విజేతగా దీపికా కక్కడ్ ఇబ్రహీం

బిగ్ బాస్ 12 సీజన్ విజేతగా దీపికా కక్కడ్ ఇబ్రహీం

Last Updated : Dec 31, 2018, 02:09 PM IST
బిగ్ బాస్ 12 సీజన్ విజేతగా దీపికా కక్కడ్ ఇబ్రహీం

గత 105 రోజులుగా హిందీ టీవీ ఆడియెన్స్‌ని అలరిస్తున్న బిగ్‌బాస్ సీజన్-12 విజేత ఎవరో తేలిపోయింది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షోలో 'ససురాల్ సిమర్ కా' టీవీ షో నటి దీపికా కక్కడ్ ఇబ్రహీం విజేతగా నిలిచి సీజన్-12 ట్రోఫీ అందుకున్నారు. గ్రాండ్ ఫినాలెలో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ ఉండగా వారిలో శ్రీశాంత్, దీపక్ ఠాకుర్‌ టాప్ ఫైనలిస్టులుగా నిలిచారు. అయితే, అంతిమంగా ట్రోఫి మాత్రం దీపికా కక్కడ్‌ని వరించింది. శ్రీశాంత్ ఫస్ట్ రన్నరప్‌గా, దీపక్ ఠాకుర్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. తాను విజేతగా గెలిచిన అనంతరం ఎంతో ఉద్వేగానికి గురైన దీపిక కక్కడ్ ఇబ్రహీం.. తన ఆత్మీయులను హత్తుకుని తన ఆనందాన్ని పంచుకున్నారు. 

Trending News