మహేష్ 25 టైటిల్‌‌పై పెరుగుతున్న ప్రచారం

వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు 25వ చిత్రం టైటిల్ పై సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.

Last Updated : Aug 6, 2018, 10:49 PM IST
మహేష్ 25 టైటిల్‌‌పై పెరుగుతున్న ప్రచారం

వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు 25వ చిత్రం టైటిల్‌పై సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. దర్శకుడు వంశీ సోషల్ మీడియా ద్వారా ట్విటర్ ద్వారా ఆర్, ఐ, ఎస్ అనే అక్షరాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. ఇది సినిమా టైటిల్‌కు సంబంధించిన హింట్ అని.. అందులోనే మూవీ టైటిల్ దాగివుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది.

ఇప్పటివరకు వంశీ విడుదల చేసిన ఆర్, ఐ, ఎస్‌లను కలిపితే మూవీ టైటిల్ 'రిషి' అని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు వంశీ విడుదల చేసిన పదాలను బట్టి ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. మరొకొందరు మహేష్ టైటిల్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే మహేష్ బర్త్ డే ఆగస్టు 9 వరకు వేచి ఉండాల్సిందే. ఆరోజునే మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదలకానుందని మూవీ యూనిట్ పేర్కొంది.  

కాగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ఎన్‌ఆర్‌ఐ పాత్రలో కన్పిస్తున్నట్లు సమాచారం. అల్లరి నరేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. అశ్వనీదత్‌, దిల్‌ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అటు మహేష్ జన్మదినం రాకముందే ఆయనకు ఓ అభిమాని స్పెషల్ గిప్ట్ అందించాడు. మ‌హేష్ ప్రస్తుతం నటిస్తున్న 25వ చిత్రంలోని స్టిల్‌తో పాటు మ‌రో 900 ఫొటోలు వాడుతూ మ్యాన్ మేడ్ పోస్టర్‌ను సృష్టించాడు. దీనిపై 43 అంతర్జాతీయ భాషల్లో ‘హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్’ అని రాయడం అందరినీ ఆకట్టుకుంటోంది.

Trending News