F2 మూవీ షూటింగ్ బిట్స్‌తో జర్నీ వీడియో

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ F2 మూవీ జర్నీ వీడియో

Updated: Jan 11, 2019, 03:20 PM IST
F2 మూవీ షూటింగ్ బిట్స్‌తో జర్నీ వీడియో
Source : Youtube@Dil Raju

వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ F2 మూవీ ఈ సంక్రాంతి కానుకగా రేపే ఆడియెన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఆ సినిమాకు సంబంధించిన జర్నీ వీడియోను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. పటాస్, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ఫిర్జాద జంటగా నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తేజ్ ఇద్దరూ తోడు అల్లుళ్లు పాత్రలు పోషించారు. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందిన తమ F2 మూవీ సంక్రాంతికి ఆడియెన్స్‌ని బాగానే ఎంటర్‌టైన్ చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.