ఇస్మార్ట్ శంకర్ నెక్స్ట్ మూవీ ప్లాన్ ఇదే..

ఇస్మార్ట్ రామ్ తో మూవీ తీసేందుకు ఫిల్మ్ మేకర్స్  క్యూ కడుతున్నారు

Last Updated : Aug 26, 2019, 02:52 PM IST
ఇస్మార్ట్ శంకర్ నెక్స్ట్ మూవీ ప్లాన్ ఇదే..

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ ఊపందుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో అభిమానుల్లో రామ్ పాపులారిటీ రెట్టింపు అయ్యింది. మూవీ మేకర్స్ దగ్గర యమ డిమాండ్ ఏర్పడింది. ఒకవైపు రామ్ నెక్స్ట్ మూవీ ఎప్పుడా అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే...మరో వైపు రామ్ కోసం కొందరు దర్శకులు కథలు రెడీ చేసే పనిలో ఉన్నారట.

రీ మేక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ !!
ఈ సారి  కాస్త భిన్నమైన కథ కోసం వెయిట్ చేస్తున్న రామ్ ... తనకు ఫుల్ గా నచ్చేసిన ఓ రీమేక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. టాలీవుడ్ వర్గాల కథనం ప్రకారం తమిళ్ సినిమా ‘తడం’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు ఎనర్జిటిక్ స్టార్. 

ముచ్చటగా మూడో సారి...!!
 రామ్ నటించే నెక్ట్స్ మూవీకి  కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయనున్నాడట. ఇప్పటికే ఇరువురి కాంబినేషన్ లో ‘నేను శైలజా’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలొచ్చాయి. ఇప్పుడు తడం రీమేక్ కోసం ముచ్చటగా మూడో సారి కలిసి పని చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ రీమేక్ తో రామ్ ఆడియన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేస్తాడో…చూడాలి మరి.

Trending News