Triglycerides: యువతలో గుండె పోటు రావడానికి ప్రధాన కారణాలు ఇవేనా..?

High Triglycerides Risk: శరీరంలో ట్రైగ్లిజరైడ్స్‌ పెరిగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది పెరగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ కూడా పెరగుతుంది. అంతేకాకుండా చాలా మంది యువతలో ఇది పెరగి గుండె పోటు సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2022, 08:18 PM IST
  • శరీరంలో ట్రైగ్లిజరైడ్స్‌ పెరగితే..
  • గుండె పోటు సమస్యలు వస్తాయి.
  • అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి.
Triglycerides: యువతలో గుండె పోటు రావడానికి ప్రధాన కారణాలు ఇవేనా..?

High Triglycerides Risk: ఈ రోజుల్లో గుండెపోటు కేసులు చాలా పెరుగుతున్నాయి. అయితే అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే యువతలో చాలా మంది ఇలాంటి ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల గుండె సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి వీరు తీసుకునే ఆహారలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో చెబు కొలెస్ట్రాల్‌ పెరగడానికి ముందు ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. అయితే ఇది కూడా శరీరంలోని రక్తంలో పెరిగే చెడు కొలెస్ట్రాలేని నిపుణులు చెబుతున్నారు. బాడిలో ఇవి పెరగడం వల్ల గుండె పోటు సమస్యలు వస్తున్నాయి.

ట్రైగ్లిజరైడ్స్ పేరుకుపోవడానికి ఇవే కారణాలు:
ట్రైగ్లిజరైడ్స్ ఒక రకమైన చెడు కొవ్వులేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది శరీరంలో ఓ మైనపులా పేరుకుపోతుంది. ఇది శరీరంలో సాధారణ ఉష్ణోగ్రత వద్ద కరగకుండా ధమనులలో పేరుకుపోతుంది. ఇవి పేరగడం వల్ల గుండెలోని నాళాలన్నీ కూడుకుపోతాయి. ఇలా కావడం వల్ల గుండె పోటు సమస్యలు వస్తాయి. సాధారణ శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి 150కి మించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 400 దాటితే చాలా తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుందని వారు చెబుతున్నారు. ఒక వేళా ఇవి పెరిగితే.. వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించండి.

గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ:
ట్రైగ్లిజరైడ్స్‌లను చాలా సులభంగా పరీక్షించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరిగితే.. అది గుండెపోటుగా మారుతుంది. అయితే ఇలా దారి తీయడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవన శైలేనని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల దీని స్థాయిలు కూడా పెరుగుతాయి. కానీ కొన్నిసార్లు కొలెస్ట్రాల్ సాధారణమైనప్పటికీ ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరుగుతుంది. సరైన సమయంలో చెక్ చేసుకోకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

యువతలో పెరుగుతున్న కేసులు:
గత కొద్దిరోజులుగా యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. 25 నుంచి 40 సంవత్సరాల యువతలో కూడా ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో యువత జంక్ ఫుడ్ తినడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ అలవాటు వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి జీవన శైలిలో పలు రకాల మార్పులు చేసుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.  అందుకే ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు తప్పనిసరిగా తీసుకోవాలి.

Also read: Hot Stocks: 15 రోజుల్లో లాభాలు కురిపించనున్న మూడు కంపెనీల షేర్లు

Also read: Hot Stocks: 15 రోజుల్లో లాభాలు కురిపించనున్న మూడు కంపెనీల షేర్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News