నాగ్, నాని మల్టిస్టారర్ చిత్రానికి క్లాసిక్ టైటిల్..!

నాగార్జున, నాని కాంబినేష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

Last Updated : Jul 3, 2018, 12:01 PM IST
నాగ్, నాని మల్టిస్టారర్ చిత్రానికి క్లాసిక్ టైటిల్..!

నాగార్జున, నాని కాంబినేష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్‌గా క‌నిపిస్తే, నాని డాక్టర్ పాత్ర పోషిస్తున్నాడ‌ని అంటున్నారు. శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ మూవీకి ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 1953లో ఏఎన్నార్ న‌టించిన‌ చిత్రం 'దేవ‌దాసు' టైట‌ల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌.త్వర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న రష్మిక మందాన, నాగార్జున స‌ర‌స‌న ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా ఈ చిత్రంలో ఉన్నాడని తెలిసింది. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వినాయ‌క చవితి సందర్భంగా విడుద‌ల కానుందని తెలుస్తుంది. కాగా మెట్రో ట్రైన్‌లో షూటింగ్ జ‌రుపుకున్న తొలి చిత్రం ఇదేనట.

Trending News