క్రిష్ తీసిన సీన్స్‌ను కట్ చేస్తున్న కంగనా

క్రిష్ తీసిన సీన్స్‌ను కట్ చేస్తున్న కంగనా

Updated: Sep 11, 2018, 08:27 AM IST
క్రిష్ తీసిన సీన్స్‌ను కట్ చేస్తున్న కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'మణికర్ణిక..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించాడు. అయితే, తెలుగులో 'ఎన్టీఆర్' బయోపిక్ తీస్తుండటంతో.. బిజీ షెడ్యూల్ వల్ల 'మణికర్ణిక' ప్రాజెక్టు నుంచి క్రిష్ తప్పుకున్నాడు. దాంతో మణికర్ణిక దర్శకత్వ బాధ్యతలను కంగనా రనౌత్ తీసుకుంది.

తాజాగా కంగనా రనౌత్ ఈ చిత్రంలోని సన్నివేశాలను తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రిష్ డైరెక్షన్లో దాదాపు సినిమా షూటింగ్ పూర్తయింది. మిగిలిన ప్యాచ్ వర్క్ కంగనా నేతృత్వంలో జరుగుతోంది. అయితే కంగనా డైరెక్ట్ చేస్తోందన్న విషయం నచ్చకే నటుడు సోనూసూద్ ఈ చిత్రం నుంచి వైదొలిగినట్లు బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి చిత్ర నిర్మాత సంజయ్ కుట్టి కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుకున్న బడ్జెట్‌కి సినిమా కంప్లీట్ కాలేక.. బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండటంతో నిర్మాత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని టాక్. కాగా సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.