ఆ డ్రెస్.. అందానికి కేరాఫ్ అడ్రస్..

ఆస్కార్ అవార్డులు, గ్రామీ అవార్డులు.. ఇలాంటి అవార్డుల ఫంక్షన్లకు వెళ్లినప్పుడు . .  హాలీవుడ్ హీరోయిన్లు తాము కొత్తగా డిజైన్ చేయించుకున్న డ్రెస్సులు వేసుకుని వస్తారు. అందులో కొత్తేమీ లేదు. ఐతే మన బాలీవుడ్ భామ.. ప్రియాంక చోప్రా గ్రామీ అవార్డుల సందర్భంగా వేసుకున్న తెల్లటి గౌను.. సర్వత్రా చర్చనీయాంశమైంది.

Last Updated : Feb 22, 2020, 04:23 PM IST
ఆ డ్రెస్.. అందానికి కేరాఫ్ అడ్రస్..

ఆస్కార్ అవార్డులు, గ్రామీ అవార్డులు.. ఇలాంటి అవార్డుల ఫంక్షన్లకు వెళ్లినప్పుడు . .  హాలీవుడ్ హీరోయిన్లు తాము కొత్తగా డిజైన్ చేయించుకున్న డ్రెస్సులు వేసుకుని వస్తారు. అందులో కొత్తేమీ లేదు. ఐతే మన బాలీవుడ్ భామ.. ప్రియాంక చోప్రా గ్రామీ అవార్డుల సందర్భంగా వేసుకున్న తెల్లటి గౌను.. సర్వత్రా చర్చనీయాంశమైంది. 

గ్రామీ అవార్డుల ఫంక్షన్ కు హాజరైన 'బేవాచ్'  భామ ప్రియాంక చోప్రా.. అక్కడ తళుక్కున మెరిసింది. రాల్ఫ్ అండ్ రస్సో తెల్లటి గౌన్ లో రెడ్ కార్పెట్‌పై హోయలు పోయింది.  ఈ డ్రెస్ .. హాలీవుడ్ పాపులర్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఔట్ ఫిట్‌లా ఉందని ప్రశంసలు కురిశాయి. ఐతే అదే సమయంలో డ్రెస్ కాస్త లో కట్ ఉండడంతో నెటిజనులు ట్రోల్ కూడా చేశారు. ఇంత కంటే మంచి డిజైన్ లభించలేదా..? అంటూ వేలాది మంది నెటిజనులు ప్రియాంక చోప్రా డ్రెస్‌పై సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. 


మరోవైపు ప్రియాంక చోప్రాకు బాలీవుడ్ నుంచి మద్దతు లభించింది. తాజాగా ఆమె గ్రామీ అవార్డుల ఫంక్షన్ సందర్భంగా వేసుకున్న డ్రెస్ అద్భుతంగా ఉందని .. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కత్రినా కైఫ్ ప్రశంసలు కురిపించారు. అంతే కాదు ఆ డ్రెస్ లో ప్రియాంక చోప్రా స్టన్నింగ్‌గా కనిపిస్తోందంటూ కితాబిచ్చారు. ఐతే ఆ డ్రెస్ చాలా మందికి ఎందుకు నచ్చలేదో తనకు తెలియదన్నారు. బహుశా వారు డ్రెస్‌ను సరిగ్గా చూడకపోవడమే కారణమై ఉండవచ్చని తెలిపారు. 

మరోవైపు ప్రియాంక చోప్రా.. డ్రెస్‌ను బాలీవుడ్ అందాల భామలు దిశా పఠానీ, హీనా ఖాన్ మెచ్చుకున్నారు. సుచిత్రా కృష్ణమూర్తి కూడా డ్రెస్ బాగుందని కామెంట్ చేశారు. అటు ప్రియాంక తల్లి మధు చోప్రా.. కూతురు వేసుకున్న డ్రెస్ చాలా బాగుందని ప్రశంసించారు. ఆమె ఆ డ్రెస్ వేసుకునే ముందే తనకు చూపించిందని తెలిపారు. నెటిజనులు ట్రోల్ చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. కంప్యూటర్ల  ముందు కూర్చుని చెడునే ఎక్కువగా ప్రచారం చేస్తారంటూ విమర్శించారు.

Trending News