13ft King Cobra's deadly attack on Snake Catcher while releasing: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముగా కింగ్ కోబ్రాకు పేరుంది. అందుకే కింగ్ కోబ్రా పేరు వింటేనే చాలా మంది హడలిపోతారు. కింగ్ కోబ్రా నేరుగా కనిపిస్తే ప్రాణాలు అర చేతిలో పట్టుకుని కోలోమీటరు మేర పరుగు తీస్తారు. కింగ్ కోబ్రా కాటు మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కింగ్ కోబ్రా కాటేస్తే భారీ ఏనుగు కూడా చనిపోతుందంటే.. దాని విషం పవర్ ఏమిటో మనం అర్ధం చేసుకోవచ్చు. అందుకే స్నేక్ క్యాచర్‌లు కూడా కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి చాలా శ్రమిస్తారు. చాలా టెక్నిక్‌లు అనుసరిస్తూ దాన్ని పట్టుకుంటారు.
రజాక్ షా అనే స్నేక్ క్యాచర్ ఎలాంటి పామునైనా చాలా సులువుగా పట్టుకుంటాడు. ఈ క్రమంలోనే 13 అడుగుల కింగ్ కోబ్రాను కూడా పట్టుకుని ఓ గోనె సంచిలో బంధించాడు. ఆ పామును తీసుకుని అడవిలో వదిలేందుకు వస్తాడు. వదిలేసే సమయంలో ఆ కింగ్ కోబ్రా.. రజాక్ షాపై దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే తన టెక్నిక్‌లతో ఆ పాము దాడి నుంచి చాలా సునాయాసంగా తప్పించుకుంటాడు. కింగ్ కోబ్రా నుంచి ఎలా తప్పించుకోవాలో రజాక్ షా కింది వీడియోలో చూపించాడు.
కింగ్ కోబ్రాను వదిలేసే క్రమంలో రజాక్ షా తోకను పట్టుకోగా.. అది కాటువేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు అతడు వెనక్కి నడుచుకుంటూ వెళుతూ తోకను పైకి ఎత్తుతాడు. కింగ్ కోబ్రాను పూర్తిగా ఎత్తితే అది కాటు వేయదట. కింగ్ కోబ్రా బాడీ నెలకు తాకితే మాత్రం కాటు వేయడానికి మెడకు దూసుకొస్తుందని రజాక్ షా చెప్పాడు. ఇందుకు సంబందించిన వీడియో 'Razak Shah Snake Rescuer' అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోకి 1,492,376 వ్యూస్ వచ్చాయి.
Also Read: Belly Fat: ఈ రేగు టీని రోజూ ఉదయం పూట తీసుకుంటే.. నడుము చుట్టు కొవ్వు వెన్నెలా కరగడం ఖాయం..
Also Read: 7th Pay Commission: డీఏ పెంపు, డీఏ ఏరియర్స్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా అప్‌డేట్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook