Professor Bikini Pics Gone Viral: బికినీ ఫోటోలు ఫోటోల కారణంగా ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం పోగొట్టుకుందనే ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆమె పని చేస్తోన్న విద్యా సంస్థ అంత ఘాటు నిర్ణయం తీసుకోవడం వెనుకున్న అసలు కారణం తెలిస్తే మీరు మరింత షాక్ అవడం గ్యారెంటీ. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్శిటీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అదే యూనివర్శిటీలో చదువుకుంటున్న ఓ 18 ఏళ్ల విద్యార్థి గురించి అతడి తండ్రి బికే ముఖర్జీ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్‌కి ఓ ఫిర్యాదు లేఖ రాశారు.
ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే.. ఇటీవలే తన కుమారుడు ఓ యువతి అసభ్యకరరీతిలో, అర్ధనర్నంగా.. ఇంకా చెప్పాలంటే లోదుస్తులపై ఉన్న ఫోటోలు చూస్తుండటం గమనించానని.. ఆ ఫోటోల్లో ఉన్నది మరెవరో కాదు.. మీ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసరే అని ఫిర్యాదు చేశాడు. ఇప్పటివరకు తన కొడుకును పద్ధతిగా, ఇటువంటి అశ్లీలానికి దూరంగా పెంచుతూ వచ్చానని, కానీ ఇప్పుడిలా వాడిని ఉద్రేకపరిచేలా మీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం వల్ల అవి చూస్తూ వాడు చెడిపోయే ప్రమాదం ఉంది అని ఆవేదన వ్యక్తంచేశాడు. తన కుమారుడిలో మార్పునకు, వింత ప్రవర్తనకు మీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ చేసిన ఫోటోలే కారణం అని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
''చదువు చెప్పే టీచర్లు ఇలా అశ్లీల ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం అనేది 18 ఏళ్ల కొడుక్కి తండ్రిగా తనకే సిగ్గుచేటుగా అనిపిస్తోంది అని చురకలంటించాడు. తనకు చదువు చెప్పే టీచరమ్మను ఓ విద్యార్థి అలా అర్ధనగ్నంగా చూడటం కూడా తీవ్ర అభ్యంతరకరమైన, అశ్లీలమైన విషయమే అవుతుంది'' అని యూనివర్శిటీ దృష్టికి తీసుకొచ్చాడు. పరోక్షంగా తన కొడుకు భవిష్యత్ గురించి ఆవేదన వ్యక్తంచేస్తూ బికే ముఖర్జీ రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో యూనివర్శిటీ వైఖరిని ఉద్యోగం పోగొట్టుకున్న సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ తీవ్రంగా తప్పుపట్టారు. బలవంతంగా, తన ఇష్టానికి వ్యతిరేకంగా తనను ఉద్యోగంలోకి తీసేశారని వాపోయారామె. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా యూనివర్శిటీ తీసుకున్న ఈ నిర్ణయం వేధింపుల కిందకే వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. గతేడాదే తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాకింగ్‌కి గురైందని.. అందువల్లే తన ప్రైవేట్ ఫోటోస్ ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని అన్నారు. ఇదే విషయమై 2021 అక్టోబర్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని గుర్తుచేశారామె.
ఇదంతా ఇలా ఉంటే.. సెయింట్ జేవియర్ యూనివర్శిటీ మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరోపణలను ఖండించింది. ఆమే స్వయంగా తన అభీష్టం మేరకే స్వచ్ఛందంగా ఉద్యోగం మానేశారని యూనివర్శిటీ చెప్పుకురావడం కొసమెరుపు. ఏదేమైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ హాఫ్ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం.., ఆమె ఫోటోలను ఓ విద్యార్థి తప్పుడు భావనతో చూస్తూ తన తండ్రికే దొరికిపోయాడని.. ఇదంతా తట్టుకోలేని ఆ తండ్రి యూనివర్శిటీకే ఫిర్యాదు చేసి ఆమె ఉద్యోగం ఊడగొట్టించాడనేది మాత్రం హైలైట్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఓ హాట్‌కేక్‌లా అమ్ముడుపోతుంది.
Also Read : Man Flying In Clouds: ఆకాశంలో పక్షిలా తేలుతున్న మనిషి.. వీడియో వైరల్
Also Read : Giant Snake Video: కారును చుట్టేసిన పెద్ద పాము.. ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P2DgvH
Apple Link - https://apple.co/3df6gDq
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Teacher Photos in Bikini: రెచ్చగొట్టేలా టీచరమ్మ బికినీ ఫోటోలు.. ఉద్యోగం హుష్‌కాకీ