Liger Trailer: విజయ్ దేవరకొండ 'లైగర్‌' ట్రైలర్ వచ్చేసింది... రౌడీ స్టార్ నెక్ట్స్ లెవల్ అంతే..

Vijay Deverakonda Liger Trailer:  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'లైగర్' ట్రైలర్ విడుదలైంది. ఫ్యాన్స్ అంచనాలకు తగినట్లే రౌడీ స్టార్‌ను మరో లెవల్‌లో చూపించాడు పూరి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 21, 2022, 11:24 AM IST
  • విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ విడుదల
  • విజయ్‌ని నెక్స్ట్ లెవల్‌లో చూపించిన పూరి
  • ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో సాగిన ట్రైలర్
Liger Trailer: విజయ్ దేవరకొండ 'లైగర్‌' ట్రైలర్ వచ్చేసింది... రౌడీ స్టార్ నెక్ట్స్ లెవల్ అంతే..

Vijay Deverakonda Liger Trailer: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'లైగర్' ట్రైలర్ విడుదలైంది. ఫ్యాన్స్ అంచనాలకు తగినట్లు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండను మరో రేంజ్‌లో చూపించాడు. ఇది పక్కా నెక్స్ట్ లెవల్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఇంటెన్స్‌తో సాగింది.

'ఒక లయన్‌కి, టైగర్‌కి పుట్టిండాడు.. క్రాస్ బీడ్ సార్ వాడు..'  అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ బిగిన్ అవుతుంది. విజయ్ దేవరకొండ యాక్షన్, మదర్ సెంటిమెంట్, బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే బీజీఎం, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాలు, గ్యాంగ్ వార్స్, అనన్య పాండేతో లవ్ సీన్స్, చివరలో మైక్ టైసన్ ఎంట్రీ... మొత్తంగా లైగర్ ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి. ఒకరకంగా ఫ్యాన్స్‌కు ఇది ఫుల్ మీల్ అన్నట్లుగా ఉంది.

ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ నుంచి రెండే రెండు డైలాగ్స్ వినిపించాయి. ఒకటి 'ఐలవ్యూ'.. రెండోది 'ఫైటర్'. ఈ రెండు డైలాగ్స్ పలికేటప్పుడు విజయ్ దేవరకొండ నత్తిలా కనిపిస్తాడు. బహుశా సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌కి నత్తి ఉంటుందేమో..! ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ మేకింగ్‌లో ఫ్రెష్‌నెస్ కనిపించింది. పూరి తన గత చిత్రాలకు భిన్నమైన మేకింగ్ స్టైల్‌ను ఫాలో అయినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ నేపథ్యంలో ఉదయం నుంచే రౌడీ ఫ్యాన్స్ హడావుడి మొదలైంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద విజయ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ట్రైలర్‌కే ఇంత సెలబ్రేషన్సా కొందరు షాకవుతుంటే... విజయ్ అన్న అంటే ఆమాత్రం ఉంటుందని ఫ్యాన్స్ బదులిస్తున్నారు. మొత్తంగా విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు లైగర్ ఫీవర్‌తో ఊగిపోతున్నారనే చెప్పాలి.

Also Read: GVL on Polavaram: ఎవరు ఔనన్నా కాదన్నా పోలవరం పూర్తి తధ్యం..జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..!

Also Read: Urfi Javed: అరాచకమైన డ్రెస్లో ఉర్ఫీ జావేద్.. అన్నీ కనిపించేలా అందాల విందు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News