close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

మరో మైలు రాయి దాటిన మహర్షి; నైజాంలో సరికొత్త రికార్డు !!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ కలెక్షన్ల పరంగా జెట్ స్పీడ్ లో దూసుకెళ్తోంది

Updated: May 15, 2019, 06:01 PM IST
మరో మైలు రాయి దాటిన మహర్షి; నైజాంలో సరికొత్త రికార్డు !!

సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిక మహర్షి కలెక్షన్ల వసూళ్లలో సరికొత్త రికార్డుల వైపు పయనిస్తోంది. ప్రస్తుతం నైజాంలో మహిర్షి మూవీ సరికొత్త రికార్డు దిశగా దూసుకెళ్తోంది.

నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమా నైజాంలో 20 కోట్ల క్లబ్ లో చేరింది. ఫస్ట్ వీకెండ్ వసూళ్లలో నాన్-బాహుబలి రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా... ఇప్పుడు 20 కోట్ల క్లబ్ లో కూడా చేరడంతో మరో రికార్డు సృష్టించినట్టయింది.

నైజాంలో ఈ సినిమాకు నిన్న కోటి 53 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ మొత్తంతో విడుదలైన 6 రోజుల్లో 20 కోట్ల రూపాయల షేర్ సాధించింది మహర్షి. ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి ఈ సినిమా నైజాంలో 30 కోట్ల షేర్ సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. మరో 2 వారాల పాటు ఈ సినిమా హవా కొనసాగే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.