'మహేష్ బాబు25' టైటిల్ ట్రెండింగ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం సిద‍్ధమవుతున్నాడు.

Last Updated : May 29, 2018, 04:17 PM IST
'మహేష్ బాబు25' టైటిల్ ట్రెండింగ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం సిద‍్ధమవుతున్నాడు. ఈ సినిమాలో మహేష్‌ బాబు డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్‌ అంటూ ఒక పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్లో మహేష్‌ గడ్డం, మీసంతో సీరియస్‌ లుక్‌లో ఉండగా పక్కనే 'రాజసం' అనే టైటిల్‌ ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోను మహేష్ అభిమానులు రూపిందించారు. 

 

మహేష్ బాబు సినిమాలో అల్లరినరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట. మహేష్ నటించబోతున్న ఈ 25వ చిత్రంలో నటించడానికి అల్లరి నరేష్ ఒప్పుకున్నాడు. అగ్రిమెంట్‌పై కూడా సంతకం చేశాడు. ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ తర్వాత అంతటి కీలకమైన పాత్ర అల్లరి నరేష్‌దేనట. సినిమాలో మహేష్‌కు ఫ్రెండ్‌గా అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు. కాకపోతే క్లయిమాక్స్‌కు వచ్చేసరికి అల్లరి నరేష్ క్యారెక్టరే హైలెట్ అవుతుందట. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ జూన్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

Trending News