Mahesh Babu: మహేష్ బాబు ట్వీట్‌కి భారీ స్పందన

Last Updated : Apr 23, 2020, 02:00 AM IST
Mahesh Babu: మహేష్ బాబు ట్వీట్‌కి భారీ స్పందన

ఎర్త్ డే సందర్భంగా మహేష్ బాబు చేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ నెటిజెన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో జనం అంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఏదైనా చెడు జరిగితే.. అందులోనూ మంచి వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలన్న చందంగా.. లాక్ డౌన్ కారణంగా జనం ఇళ్లలోంచి బయటికి రాకపోవడంతో వాతావరణంలో చాలా చక్కటి మార్పు కనిపిస్తోంది. గాలిలో కాలుష్యం, నీటిలో కాలుష్యం కనుమరుగయ్యాయి. అలా ఏరోజుకు ఆరోజు వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని మహేష్ బాబు కూడా గుర్తు చేస్తూ.. కేవలం కరోనా లాంటి సంక్షోభంలోనే కాకుండా ఎప్పుడూ ఆ ప్రకృతికి మనం చేయదగినదాంట్లో ఎంతో కొంత చేద్దాం అంటూ ఎర్త్ డే సందర్భంగా ఓ ట్వీట్ చేశారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్‌కి అభిమానుల నుంచి, నెటిజెన్స్‌ నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. మహేష్ బాబు ఈ ట్వీట్ చేసిన అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని వేల మంది ఈ ట్వీట్‌ని లైక్ చేస్తూ కామెంట్స్ చేయగా..ఇంకొన్ని వేల మంది రిట్వీట్ చేశారు.

Trending News