మహర్షి టీజర్ అదుర్స్

మహర్షి టీజర్ అదుర్స్

Last Updated : Apr 6, 2019, 11:16 AM IST
మహర్షి టీజర్ అదుర్స్

మహేష్ బాబు అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న క్షణం రానే వచ్చింది. భరత్ అనే నేను లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయన హీరోగా నటించిన మహర్షి సినిమాకు సంబంధించిన టీజర్ ఉగాది కానుకగా ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వనీదత్, పొట్లూరి వరప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో ఇది ఆయనకు 25వ సినిమా.

ఈ టీజర్‌లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా వుంది. మే 9న విడుదల కానున్న మహర్షి సినిమాలో మహేష్‌ బాబుకు జంటగా పూజా హెగ్దే నటించగా.. మరో ప్రధాన పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నాడు.

Trending News