మహేష్ బాబు తర్వాతి సినిమా తెలంగాణలో రజాకారుల గురించి కాదా ?

మహేష్ బాబు తర్వాతి సినిమా తెలంగాణలో రజాకారుల గురించి కాదా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ సినీవర్గాలు. 

Last Updated : Jan 17, 2019, 12:09 PM IST
మహేష్ బాబు తర్వాతి సినిమా తెలంగాణలో రజాకారుల గురించి కాదా ?

మహేష్ బాబు, బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు సుకుమార్ కాంబోలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇటీవల సుకుమార్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్ బాబు... మీతో సినిమా చేయడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమాకు సంబంధించిన జానర్ ఖరారైనట్టు తెలుస్తోంది. మొదట్లో తెలంగాణలో రజాకారులపై వీళ్లిద్దరి సినిమా వుండనున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, తాజాగా సినీవర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సుక్కు దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ చేయనున్న సినిమా ఓ రొమాంటిక్ యాక్షన్ జానర్ నేపథ్యంతో వుండనున్నట్టు సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ నెలలో ఆ సినిమాను పూర్తి చేసుకుని మే నెలలో కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్న మహేష్ బాబు జూన్‌లో సుకుమార్ సినిమా షూటింగ్ కి హాజరుకానున్నాడని టాత్.

Trending News