తాతయ్య కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య కాబోతున్నారు. ఆయన కుమార్తె శ్రీజ ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. 

Last Updated : Nov 6, 2018, 11:44 AM IST
తాతయ్య కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య కాబోతున్నారు. ఆయన కుమార్తె శ్రీజ ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. ఆమె తన భర్తతో సహా ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకోవడంతో.. అనేకమంది శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పంపుతున్నారు. 'శ్రీజ కళ్యాణ్ బేబీ 2 లోడింగ్' అనే హ్యాష్ ట్యాగ్‌తో శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతులు పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీజ, కళ్యాణ్‌ల వివాహం మార్చి 28, 2016 తేదిన  జరిగిన సంగతి తెలిసిందే. బెంగుళూరులో ఈ వివాహం రంగరంగ వైభవంగా జరిగింది.

శ్రీజకు అప్పటికే శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. తర్వాత ఆయనకు విడాకులు ఇచ్చి.. మరల మరో వివాహం చేసుకున్నారు శ్రీజ. శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ అమెరికాలో ప్రముఖ జ్యువెలరీ వ్యాపారైన కెప్టెన్ కిషన్ కుమారుడు. ఇటీవలే కళ్యాణ్ దేవ్ "విజేత" సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. 

చిరంజీవి ప్రస్తుతం "సైరా నరసింహారెడ్డి" సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిరు కుమారుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. దాదాపు నాలుగు భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

Trending News