Hero Suman: తిరుమలలో రెచ్చిపోయిన హీరో సుమన్.. వైఎస్సార్సీపీపై సంచలన వ్యాఖ్యలు..

Suman Visits Tirumala: హీరో సుమన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన విరామంలో స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో కూటమిపై ప్రశంసలు కురిపించారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Jun 15, 2024, 05:17 PM IST
  • చంద్రబాబు వల్లే ఏపీ డెవలప్‌ మెంట్..
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో సుమన్..
Hero Suman: తిరుమలలో రెచ్చిపోయిన హీరో సుమన్.. వైఎస్సార్సీపీపై సంచలన వ్యాఖ్యలు..

Hero suman fires on ex cm ysjagan: హీరో సుమన్ తిరుమల శ్రీవారికి ఈరోజు (శనివారం) దర్శించుకున్నాడు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో పండితులు హీరో సుమన్ కు ప్రత్యేకంగా ఆశీర్వాదాలు, ప్రసాదాలు అందజేశారు. స్వామి వారిని దర్శనంచేసుకుని బైటకు వచ్చాక మీడియాలో మాట్లాడారు. ఏపీలో ప్రజులు ఈసారి ఎన్నికలలో కూటమిని ఎన్నుకుని మంచి పనిచేశారన్నారు. కూటమిని భారీ మెజార్టీతో గెలిపించుకొవడం శుభపరిణమామని అన్నారు. గెలిచిన కూటమినేతలకు స్పెషల్ గా విషేస్ చెప్పారు. అంతే కాకుండా.. ఏపీ గత ప్రభుత్వం వైసీపీపై మండిపడ్డారు.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

వైసీపీ పాలనలో ఏపీ.. ఐదేళ్లు అన్నిరంగాలలో వెనక్కు వెళ్లిందన్నారు.  ఒక వైపు నిర్మాణత్మకంగా పనులు జరుగుతున్నప్పుడు.. కూల్చివేతలు వంటివి ఉండకూడదని గత ప్రభుత్వం చేసిన పనులను ఇన్డైరెక్ట్ గా విమర్శించారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కూటమి గెలుపుపై సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అమరావతి రాజధాని అన్నిరకాలుగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఏపీలో అన్నిరకాల డెవలప్ మెంట్ జరిగితేనే.. మంచి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయని, దీని వల్ల విద్యా, వైద్యం, వ్యవసాయం,ఉపాధి, ఉద్యోగాలు యువతకు లభిస్తాయన్నారు. మరోవైపు తెలంగాణలో హైదరాబాద్ ఊహించని విధంగా మారిపోయిందని, హైదరాబాద్ లో గచ్చిబౌలీని చూస్తుంటే తెలంగాణలో ఉన్నామా.. లేదా న్యూయార్క్ లో ఉన్నామా.. అన్న అనుమానం కల్గుతుందన్నారు.

అంతగా హైదరాబాద్ డెవలప్ అయ్యిందన్నారు. ఇక ఏపీ క్యాపిటల్ కూడా అంతే డెవలప్ అవ్వాలని, అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు హీరో సుమన్ చెప్పారు. ఏపీ డెవలప్ మెంట్ కూటమితో సాధ్యమని సుమన్ అన్నారు. ఏపీ డెవలప్ మెంట్ కు అందరు సహకరించాలని కోరారు. మరోవైపు అమరావతి కాస్మోపాలిటన్ సిటీగా ఎదగాలని ఆశీస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతికి టెంపుల్ సిటీగా ప్రకటించాలని, తిరుపతి, ఈస్ట్-వెస్ట్ గోదావరిలలో ఫిలింసీటీలు ఏర్పాటు చేయాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు.

Read more: Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

హీరో సుమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో, సినిమా రంగంలోను హట్ టాపిక్ గా మారాయి. ఇక మరోవైపు చంద్రబాబు ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఆయాశాఖలను కేటాయించారు. చంద్రబాబు నాల్గొసారి సీఎం అయ్యాక.. తొలిసారి తిరుపతికి వెళ్లారు. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడ్తామన్నారు. దీనిలో భాగంగా గతంలో ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి బైబై చెప్పేసి..  కొత్తగా శ్యామలరావుకు తిరుమల ఈవో బాధ్యతలను అప్పగించారు.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News