ఇవాంకా జీఈఎస్ సదస్సులో పాల్గొనటానికి హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే..! అయితే అజ్ఞాతవాసి పాటకు.. ఇవాంకా కు సంబంధం ఏంటీ.. అనేగా మీ డౌట్?
ఇవాంకా రాకతో హైదరాబాద్ లో ఉదయం 10 గంటలకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ట్రాఫిక్ లో నవదీప్ చిక్కుకున్నాడు. ఈ విషయాన్ని నవదీప్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. 'బయటికెళ్లి చూస్తే టైమేమో 10' ఓ క్లాక్. ఇంటికెళ్లే రోడ్డు మొత్తం ఇవాంకా రోడ్డు బ్లాక్' అని సరదాగా ట్విట్ చేసాడు.
ఈ పాట 'అజ్ఞాతవాసి' చిత్రంలోనిది. అసలు పాట 'బయటికెళ్లి చూస్తే టైమేమో 3'ఓ క్లాక్'. ఇంటికెళ్తున్న నవదీప్ ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో ఈ పాట గుర్తొచ్చిందో ఏమో.. ఇవాంకాను ఉద్దేశిస్తూ ఇలా ట్వీట్ పెట్టాడు.
Baitikelli chusthe time emo 10 o clock
Intikelle road mothham ivanka road block !! #haha :)— Navdeep (@pnavdeep26) November 28, 2017