Prabhas's next movie : మహానటి దర్శకుడితో ప్రభాస్ నెక్ట్స్ సినిమా

ప్రభాస్ కొత్త సినిమా ఖరారైంది. బాహుబలి, సాహో వంటి చిత్రాల తర్వాత ప్రభాస్ రేంజ్, క్రేజ్ భారీగా పెరిగిపోయాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ ప్రభాస్‌కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ తరహాలో భారీ చిత్రాల తర్వాత ప్రభాస్ సైన్ చేయబోతున్న సినిమా ఏంటా అనే ఉత్కంఠ ఆడియెన్స్ అందరిలోనూ నెలకొని ఉంది.

Last Updated : Feb 26, 2020, 09:43 PM IST
Prabhas's next movie : మహానటి దర్శకుడితో ప్రభాస్ నెక్ట్స్ సినిమా

ప్రభాస్ కొత్త సినిమా ఖరారైంది. బాహుబలి, సాహో వంటి చిత్రాల తర్వాత ప్రభాస్ రేంజ్, క్రేజ్ భారీగా పెరిగిపోయాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ ప్రభాస్‌కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ తరహాలో భారీ చిత్రాల తర్వాత ప్రభాస్ సైన్ చేయబోతున్న సినిమా ఏంటా అనే ఉత్కంఠ ఆడియెన్స్ అందరిలోనూ నెలకొని ఉంది. ఇదిలావుండగానే తాజాగా ప్రభాస్ కొత్త సినిమా అప్‌డేట్ వెలువడింది. మహానటి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో ప్రభాస్‌ తన నెక్ట్స్ సినిమా చేయనున్నాడు. ప్రముఖ  నిర్మాత అశ్వినీదత్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాడు. వైజయంతి మూవీస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న క్రమంలో ప్రభాస్‌తో ఓ భారీ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నట్టు అశ్వనిదత్ ప్రకటించారు.

ప్రభాస్ అభిమానులు సంతోషపడేలా సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నివిధాల కృషిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటిస్తూ వైజయంతి మూవీస్ చిత్ర నిర్మాణ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేయడం విశేషం. వైజయంతి మూవీస్ పోస్టు చేసిన ఈ ట్వీట్‌లో ప్రభాస్, అశ్వినీదత్, నాగ్ అశ్విన్ సింగిల్ ఫ్రేములో ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు.

ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ సైతం వీళ్ల కాంబినేషన్‌పై తన ఇన్‌స్టాగ్రామ్‌పై ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తరణ్ ఆదర్శ్ పోస్ట్ చేసిన ఆ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఏంటో మీరే చూడండి.

మహానటి చిత్రానికి నంది అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డుల పంట పండించిన నాగ్ అశ్విన్... ఈసారి ప్రభాస్‌తో సినిమా కోసం ఎటువంటి కథను సిద్ధం చేసుకున్నాడనేది తెలియాల్సి ఉంది. అయితే, ప్రభాస్ లాంటి మాంచో కోసం మాంచి కథ అయితే కచ్చితంగా రెడీ అయి ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News