ప్రభాస్ పెళ్లిపై ఎప్పటి నుంచో ఉత్కంఠ కొనసాగుతూ వస్తోంది. బాహుబలి సినిమా సెట్స్‌పై ఉన్నప్పటి నుంచి మొదలుపెడితే, నేటి వరకు అనేక సందర్భాల్లో ప్రభాస్ పెళ్లి గురించి అనేక వార్తలొచ్చాయి. బాహుబలి బ్యూటీ అనుష్కనే పెళ్లి చేసుకోబోతున్నాడని కొన్ని సందర్భాల్లో, కాదు కాదు.. వేరే అమ్మాయితో ప్రభాస్ పెళ్లి అని ఇంకొన్ని సందర్భాల్లో ఇలా రకరకాల వార్తలు ఎప్పటికప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న ప్రభాస్ పెద్ద నాన్న, ఆనాటి రెబల్ స్టార్ కృష్ణం రాజు.. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో ప్రభాస్ పెళ్లిపై స్పందించాడు. సాహో సినిమా విడుదల అనంతరం ప్రభాస్ పెళ్లి జరుగుతుందని క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు.. ఆ తర్వాత గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై ప్రభాస్‌తో ఓ సినిమా చేయనున్నట్టు స్పష్టంచేశాడు. ఆ సినిమాలో తాను కూడా ఓ ప్రధాన పాత్ర పోషించనున్నట్టు కృష్ణంరాజు తెలిపాడు.
ఈ సందర్భంగా ఎస్వీ రంగారావు బయోపిక్ వస్తే చూడాలని ఉందని తన కోరికను వెలిబుచ్చిన ఆయన.. అందులో ప్రకాశ్ రాజ్ నటిస్తే బాగుంటుందని తన మనసులో మాటను బయటపెట్టాడు.