రజినీకాంత్‌కి భారీ భద్రత కల్పించిన ప్రభుత్వం

రజినీకాంత్‌కి భారీ భద్రత కల్పించిన ప్రభుత్వం

Last Updated : Sep 9, 2018, 07:05 PM IST
రజినీకాంత్‌కి భారీ భద్రత కల్పించిన ప్రభుత్వం

సూపర్ స్టార్ రజినీకాంత్‌కి భారీ భద్రతా కల్పించింది యూపీ ప్రభుత్వం. రజినీకాంత్  ఇటీవలే తన 165 సినిమా టైటిల్‌ను ప్రకటించారు. కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించే ఈ చిత్రానికి  ‘పేట్టా’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో రజనీ సరసన త్రిష నటిస్తున్నారు. రజినీ చిత్రం పేటా చిత్రీకరణ లక్నో, వారణాసి, సొన్ భద్రలో నెలరోజులపాటు జరగనుందని సినీ వర్గాలు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం రజనీ కోసం 25 మంది పోలీసులతో హై సెక్యూరిటీని కల్పించిందట.

 పేట్టా మోషన్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్‌కి ఇప్పటికే ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో తెగ లైకులు, షేరులు వస్తున్నాయి. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. విజయ్‌ సేతుపతి, సిమ్రన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, బాబీ సింహా, గురు సోమసుందరం, మేఘా ఆకాశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానరుపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తిరు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తుండగా.. వివేక్ హర్షన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 2018 నెలలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ డార్జిలింగ్‌లో జరిగింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో తలైవా చాలా స్టైలిష్, మాస్‌ లుక్‌తో కనిపిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది.

మరోపక్క శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘2.ఓ’ సినిమా టీజర్‌ను సెప్టెంబరు 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అమీ జాక్సన్‌, అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని నవంబరు 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Trending News