బిగ్‌బాస్ షోలో రకుల్ ప్రీత్ సింగ్

బాలీవుడ్‌లో తాను నటించిన 'ఐయ్యారి' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రియాల్టీ షో లో పాల్గొంటున్నానని రకుల్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపింది

Last Updated : Jan 8, 2018, 01:16 PM IST
బిగ్‌బాస్ షోలో రకుల్ ప్రీత్ సింగ్

ఇటీవల తమిళ చిత్రం 'తీరాన్ అధిగిరం ఒండ్రు'లో ప్రధాన పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ కన్నడ, హిందీ, తెలుగు చిత్రాలలో నటించారు. అతితక్కువ కాలంలోనే ఈ నటి టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా స్థానం సంపాదించుకుంది. అయితే.. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తానూ హిందీ బిగ్ బాస్ రియాల్టీ షో లో పాల్గొననున్నట్లు చెప్పింది. 

బాలీవుడ్‌లో తాను నటించిన 'ఐయ్యారి' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రియాల్టీ షోలో పాల్గొంటున్నానని రకుల్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపింది. సిద్దార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్ పాయ్‌లతో కలిసి రకుల్ ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా దర్శకుడు నీరజ్ పాండే. ఈ చిత్రం రిపబ్లిక్ డే రోజున విడుదల కానుంది.

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ (హిందీ) 11వ సీజన్ జనవరి 14న ముగుస్తుంది. బిగ్ బాస్ (తమిళ్), బిగ్ బాస్ (తెలుగు లో  సెలబ్రిటీలు తమ సినిమాలను ప్రచారం చేసుకోవడానికి బిగ్ బాస్ ఇళ్లలోకి ప్రవేశించారు. ఇప్పుడు అలానే రకుల్ ప్రీత్ తన సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశించనుంది. కాగా.. ఈ షో సంక్రాంతి సందర్భంగా ప్రసారం కానుంది.

 

Trending News