డిస్కో రాజా రవితేజకు వింత జబ్బట!

డిస్కో రాజా రవితేజకు వింత జబ్బట!

Last Updated : Apr 22, 2019, 11:35 AM IST
డిస్కో రాజా రవితేజకు వింత జబ్బట!

మాస్ మహారాజ రవితేజ చేస్తోన్న కొత్త సినిమాకు డిస్కోరాజా అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వి ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రవితేజ సరసన 'ఆర్ఎక్స్ 100 ఫేమ్' పాయల్ రాజ్‌పుత్ జంటగా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాలో రవితేజ పోషించే పాత్రకు ఒక వింత జబ్బు ఉంటుందట. ఆ ఆరోగ్య సమస్య మీదే సినిమా మొత్తం నడుస్తుందని, ఆ పాత్ర ఆధారంగా చేసుకుని సినిమాకు ఆ టైటిల్ ఖరారు చేశారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ ఆరోగ్య సమస్య ఏమిటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉండనుంది. 

రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాభ నటేష్ మరో కథానాయికగా, బాబి సింహ మరో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Trending News