సల్మాన్ మరదలితో అసభ్య ప్రవర్తన

ఓ  సీనియర్ నటుడు అయి ఉండి ఆడవారిపట్ల ఇలా ప్రవర్తించడం మంచిదికాదని కామెంట్లు చేస్తున్నారు.

Updated: May 13, 2018, 03:26 PM IST
సల్మాన్ మరదలితో అసభ్య ప్రవర్తన

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్.. సల్మాన్ ఖాన్ మరదలితో అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పెళ్లి రిసెప్షన్‌కు రిషి కపూర్ తన భార్య నీతూ కపూర్‌తో కలిసి వచ్చారు. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్, ఆయన మరదలు సీమీ ఖాన్ కూడా వచ్చారు. ఈ వేడుకలో సీమా పట్ల రిషి అసభ్యంగా ప్రవర్తించారట. సల్మాన్‌.. తనను పలకరించకుండా తోటి నటులతో స్టెప్పులేస్తున్నారన్న కారణంతో రిషి ఇలా చేశాడట. 

సీమా తన పట్ల జరిగిన విషయాన్ని చెప్పగా సీరియస్‌ అయిన సల్మాన్ రిషితో మాట్లాడేందుకు వెళ్తే..  అప్పటికే ఆయన వేడుక నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే సీమా పట్ల తన భర్త ప్రవర్తించిన తీరుకు భార్య నీతూ వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారట. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రిషిపై మండిపడ్డారు. ఓ  సీనియర్ నటుడు అయి ఆడవారిపట్ల ఇలా ప్రవర్తించడం మంచిదికాదని కామెంట్లు చేస్తున్నారు.