RRR: తెలుగు సినిమాకు ఫిదా అయిన హాలీవుడ్ క్రిటిక్స్

RRR Bags Hollywood Critics Association  Midseason Award: రాజమౌళి చివరిగా ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశారు.  ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్టు సినిమాల లిస్టులో  ఆర్ఆర్ఆర్ నిలిచింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 04:52 PM IST
  • ఆర్ఆర్ఆర్ కు మరో అరుదైన గుర్తింపు
  • రెండో బెస్ట్ ఫిలింగా గుర్తించిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్
RRR: తెలుగు సినిమాకు ఫిదా అయిన హాలీవుడ్ క్రిటిక్స్

RRR Bags Hollywood Critics Association  Midseason Award: జక్కన్నగా దర్శక ధీరుడుగా తెలుగు ప్రేక్షకులందరూ భావించే రాజమౌళి చేస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కెరియర్లో అపజయమే ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న రాజమౌళి చివరిగా ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశారు. అసలు చరిత్రలో కలవని ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది అని ఊహతో రూపొందించిన సినిమానే ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ, కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించి తమదైన శైలిలో సినిమాకు ప్రాణం పోశారు. 

ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ, మకరంద్ దేశ్ పాండే వంటి ఇతర టాలెంటెడ్ నటీనటులు కూడా భాగమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 1130 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదిక కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వర్షన్లు జీ5 యాప్ లో ప్రసారమవుతూ ఉండగా హిందీ వర్షన్ మాత్రం నెట్  ఫ్లిక్స్ లో ప్రసారమవుతోంది. నెట్  ఫ్లిక్స్ లో కేవలం హిందీ వర్షన్ మాత్రమే కాకుండా కొన్ని విదేశీ భాషలకు సంబంధించిన సబ్ టైటిల్స్ కూడా ప్రవేశపెట్టడంతో ఈ సినిమా విదేశాల్లో ఉన్న వారిని కూడా ఆకర్షిస్తోంది. 

నెట్  ఫ్లిక్స్ లో సినిమా విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సినిమాకి మంచి గుర్తింపు కూడా దక్కింది.. అయితే తాజాగా ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఈ ఏడాది ఉత్తమ 10 చిత్రాలలో ఈ సినిమాని కూడా ఎంపిక చేశారు. ఇలా ఒక భారతీయ సినిమా ఈ లిస్టు కోసం ఎంపిక కావడం ఇదే మొదటిసారి. అయితే కేవలం నామినేట్ అవ్వడమే కాదు ఆ లిస్టులో రెండో అవార్డు సంపాదించి ఈ సినిమా మరింత క్రేజ్ సంపాదించింది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను డివివి దానయ్య సుమారు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించారు.
Also Read: CM Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలి!.. రామ్ సినిమా ఈవెంట్లో బ్యానర్లు

Also Read: Nani's Dasara Movie : ఇదేదో తేడాగా ఉందే.. కొత్త అనుమానాలు మొదలు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News