నాగచైతన్య: 'స‌వ్యసాచి' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

నాగచైతన్య: 'స‌వ్యసాచి' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

Updated: Oct 9, 2018, 10:01 PM IST
నాగచైతన్య: 'స‌వ్యసాచి' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

అక్కినేని నాగ చైత‌న్య‌-చందూ మొండేటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం 'స‌వ్యసాచి'. ఇందులో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్. ‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందు మొండేటి, నాగ చైతన్య కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక‌లు కీలక పాత్రలు పోషించారు. రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు. అక్టోబ‌ర్ 1 విడుదలై టీజ‌ర్‌ మూవీ అంచనాలను రెట్టింపు చేసింది.

నవంబర్ రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తొలి లిరికల్ సాంగ్‌ 'వై నాట్ సాంగ్'ని చిత్ర యూనిట్ మంగళవారం విడుద‌ల చేసింది. అనంత్ శ్రీ‌రామ్ రాసిన ఈ గీతాన్ని రోహిత్, మ‌నీషా ఆల‌పించగా.. ఎం ఎం కీర‌వాణి సంగీతం స‌మ‌కూర్చాడు. తాజాగా విడుద‌లైన ఈ సాంగ్‌ను మీరూ వినండి..