బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నిర్మాత-వ్యాపారవేత్త గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్(18) ఇంటర్నెట్ సంచలనంగా మారింది. మొట్టమొదటిసారిగా సుహానా వోగ్ ఇండియా ఆగస్టు మ్యాగజిన్ కవర్ పేజీ మీద కనిపించింది.
షారుఖ్, గౌరీ ఖాన్ ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్లోకి వెళ్లి కూతురు సుహానాను ప్రపంచానికి పరిచయం చేశారు. వోగ్ ఇండియా మ్యాగజిన్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. వోగ్ మ్యాగజిన్ కవర్ పేజీ మీద కనిపించడంతో పలువురు సినీ ప్రముఖులు సుహానాను అభినందించారు.
ఇటీవలే మ్యాగజిన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్ జరిగింది. అందుకు సంబంధించిన వీడియోను సుహానా తల్లి గౌరీ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Awesome shoot with Suhana... @VOGUEIndia.
Photographed by: @Errikos_Andreou Styled by: @Anaita_Adajania
Hair: @YianniTsapatori pic.twitter.com/TbxuCjZ5Os— Gauri Khan (@gaurikhan) July 31, 2018
ఇక వోగ్ ఇండియాతో పలు విషయాలు మాట్లాడిన సుహానా, పలు రకాల వ్యక్తులని కలవడం, వారు సాయం చేయడం.. నాలో కాన్ఫిడెంట్‌ను బాగా పెంచిందని చెప్పుకొచ్చింది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీతో ఉన్న ఫోటోని అప్లోడ్ చేసి విమర్శల పాలైన సుహానా... దానికి క్లారిటీ కూడా ఇచ్చింది. అలానే తండ్రి స్టార్డమ్ గురించి మాట్లాడింది.
ప్రస్తుతం ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నసుహానా త్వరలో వెండితెర ఎంట్రీ ఇవ్వనుందని టాక్.