SP Balasubrahmanyam: ఫేమస్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా

ఇటీవల టాలీవుడ్‌లో ఇద్దరు ప్రముఖ దర్శకులు కరోనా బారిన పడగా.. తాజాగా ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్‌ (Singer SP Balu COVID19 Positive)గా వైద్యులు నిర్ధారించారు.

Last Updated : Aug 5, 2020, 02:07 PM IST
SP Balasubrahmanyam: ఫేమస్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా

కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి ఏ రంగాన్ని, ఎవరినీ వదలడం లేదు. నిత్యం కోరలు చాస్తూ వేలాది కేసులు మరణాలకు కారణమవుతూ విజృంభిస్తోంది. ఇటీవల టాలీవుడ్‌లో ఇద్దరు ప్రముఖ దర్శకులు కరోనా బారిన పడగా.. తాజాగా ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్‌ (SP Balasubrahmanyam COVID19 Positive)గా వైద్యులు నిర్ధారించారు. అంతకుముందు ఫిమేల్ సింగర్ స్మితకు కరోనా సోకడం తెలిసిందే. Pruthvi Raj: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటుడు

తనకు కోవిడ్19 పాజిటివ్‌ (Singer SP Balu CoronaVirus Positive)గా తేలడంపై ఎస్పీ బాలు స్పందించారు. ఈ మేరకు వీడియో ద్వారా పరిస్థితి వివరించారు. గత మూడు రోజులుగా కాస్త అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించామని, అయితే టెస్టుల్లో కోవిడ్19 పాజిటివ్‌గా తేలిందన్నారు. మెడిసిన్ ఇచ్చి హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని చెప్పారు. Director Teja: తేజకు కరోనా పాజిటివ్

కుటుంబసభ్యలుకు ఇబ్బంది కలగకూడదని భావించి ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఏ ఆందోళన అక్కర్లేదని తన వీడియో ద్వారా సింగర్ ఎస్పీబీ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జ్వరం తగ్గిందని, త్వరలోనే కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్తానని ఎస్పీ బాలు ధీమా వ్యక్తం చేశారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 
Photos: గులాబీ డ్రెస్సులో యంగ్ బ్యూటీ సోయగాలు..

Trending News