విశాల్‌పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు.. ఆధారాలున్నాయని వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం సైతం అంత సులువుగా లభించదని అనేక సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తాజాగా నటుడు విశాల్‌పై అదేవిధమైన ఆరోపణలు చేయడం ద్వారా మరోసారి వార్తల్లోకెక్కినట్టు తెలుస్తోంది.

Last Updated : Jun 18, 2019, 12:10 PM IST
విశాల్‌పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు.. ఆధారాలున్నాయని వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం సైతం అంత సులువుగా లభించదని అనేక సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తాజాగా నటుడు విశాల్‌పై అదేవిధమైన ఆరోపణలు చేయడం ద్వారా మరోసారి వార్తల్లోకెక్కినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌‌లోనూ పలువురు ప్రముఖ దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేసి తమిళ సినీ పరిశ్రమలోనూ ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి.. నడిగర్‌ సంఘం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నటుడు విశాల్‌ని లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు చేసినట్టు సమాచారం. మీడియాలో వస్తున్న పలు కథనాల ప్రకారం ప్రస్తుతం నడిగర్‌ సంఘం ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న విశాల్‌‌కు ఓటు వేసే ముందు అతడు ఎలాంటి వాడో ఒకసారి తెలుసుకోవాలని, అతను అమ్మాయిలను వాడుకొని వదిలేసే రకమని శ్రీరెడ్డి ప్రచారం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. విశాల్ క్యారెక్టర్‌కు సంబంధించిన ఆధారాలు తన వద్ద వున్నాయని ఆమె ఆరోపించినట్టుగా కోలీవుడ్ వర్గాల చెబుతున్నాయి. 

గతంలో న్యాచురల్ స్టార్ నానిపై శ్రీరెడ్డి ఇటువంటి ఆరోపణలే చేసినప్పుడు హైదరాబాద్ వచ్చిన విశాల్.. ఆ సమయంలో హీరో నానికి అండగా నిలబడ్డాడు. శ్రీరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు. ఇవాళ నానికి మద్దతుగా నిలుస్తున్నందుకు రేపు శ్రీరెడ్డి తనపై కూడా ఆరోపణలు గుప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అప్పట్లోనే విశాల్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

Trending News