'సాఫ్ట్‌వేర్ సుధీర్‌'గా సుడిగాలి సుధీర్

'సాఫ్ట్‌వేర్ సుధీర్‌'గా సుడిగాలి సుధీర్

Last Updated : May 25, 2019, 11:39 PM IST
'సాఫ్ట్‌వేర్ సుధీర్‌'గా సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్.. తెలుగు బుల్లితెర ఆడియెన్స్‌కి పరిచయం అక్కర్లేని పేరు. జ‌బ‌ర్ధ‌స్త్‌, ఢీ, పోవే పోరా వంటి కార్య‌క్ర‌మాల‌తో బుల్లితెరపై మెప్పించిన యాంక‌ర్ సుధీర్... జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో సుడిగాలి సుధీర్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు బుల్లితెరపై రాణించిన సుడిగాలి సుధీర్ తొలిసారిగా వెండితెరపై ప్రధాన పాత్ర పోషిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వంలో సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే సినిమాతో సుడిగాలి సుధీర్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.

శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ సరసన ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తోంది. జూలై చివ‌రి వారంలో ఆడియెన్స్ ముందుకురానున్న ఈసినిమా ప్రస్తుతం 50 శాతం టాకీ పూర్తి చేసుకుంది. స్టాండప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ఈ సినిమాతో నటుడిగానూ స్థిరపడొచ్చని ఆశిస్తున్నాడు.

Trending News