close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

సైరాలో ''తమన్న''ది బాహుబలి  తరహా స్ట్రాంగ్ రోల్ !!

మెగాస్టార్ మూవీలో తమన్న బాహుబలి తరహాలో స్టాంగ్ రోల్ లో నటిస్తోంది

Updated: Aug 22, 2019, 01:09 PM IST
సైరాలో ''తమన్న''ది బాహుబలి  తరహా స్ట్రాంగ్ రోల్ !!

సైరా మూవీలో లక్ష్మి క్యారెక్టర్ లో నటిస్తోంది తమన్నా.. అయితే మొదల్లో ఆమె రోల్ పై పెందగా అంచాలు లేవు. ఈ క్యారెక్టర్ లుక్స్ రివీల్ చేసినప్పుడు లక్ష్మి క్యారెక్టర్ పెద్దగా పోకస్ అవలేదు కూడా. కానీ రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి తమన్నా పాత్రపై ఫోకస్ పెరిగింది. టీజర్ లో కనిపించిన సింగిల్ షాట్ తో.. తమన్నాది పవర్ ఫుల్ క్యారెక్టర్ అని తెలిసిపోయింది. నరసింహా రెడ్డి అనుచరుల్లో ఒకరైన ‘లక్ష్మి’ క్యారెక్టర్ కి సినిమాలో మంచి వెయిట్ ఉందనే టాక్ వచ్చింది.

‘బాహుబలి’సినిమాలో కూడా అంతే. తమన్నా దేవసేనను ఎలాగైనా విడిపించుకురావాలనే ప్రయత్నంలోనే ఉంటుంది. అప్పటివరకు గ్లామరస్ క్వీన్ అనిపించుకున్న తమన్నా కత్తి పట్టుకుని ఫైట్ చేస్తుంటే అంతా షాక్ అయ్యారు. ఇప్పుడు ప్రేక్షకులకు మరోసారి షాక్ ఇచ్చేందుకు తమన్న ముస్తాబు అవుతోందని. ‘బాహుబలి’లో అవంతిక గా మెప్పించిన మిల్కీ బ్యూటీ తమన్న ‘సైరా’ లో  ‘లక్ష్మి’ గా ఏ స్థాయిలో సమరానికి సై అంటుందో చూడాలి మరి.