టాలీవుడ్‌ చిత్రంలో హీరోగా.. గల్లా జయదేవ్ కుమారుడు

తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ "అదే నువ్వు అదే నేను"  అనే తెలుగు చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయవుతున్నారు. 

Last Updated : Oct 19, 2018, 02:30 PM IST
టాలీవుడ్‌ చిత్రంలో హీరోగా.. గల్లా జయదేవ్ కుమారుడు

తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ "అదే నువ్వు అదే నేను"  అనే తెలుగు చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయమవుతున్నారు. స్వయానా మహేష్ బాబుకి మేనల్లుడి వరసైన అశోక్ నటిస్తున్న ఈ చిత్రానికి కన్నడ నటి నభా నటాషా  కథానాయికగా సైన్ చేశారు. గతంలో ఆమె ‘నన్ను దోచుకుందువటే’  సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. శశి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజయ్యారు. అలాగే ఈ ఫంక్షన్‌కు దిగ్దర్శకుడు రాఘవేంద్రరావు, మంజుల, నిర్మాత దిల్ రాజు మొదలైన వారు హాజరయ్యారు.

రాఘవేంద్రరావు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించగా.. అమర్ రాజా మీడియా అండ్   ఎంటర్ టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిప్ హాప్ త‌మీజా ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్ గత కొంత కాలంగా అమెరికాలో నటనలో శిక్షణ తీసుకుంటున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే  రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. 

అమర్ రాజా బ్యాటరీస్ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్న గల్లా జయదేవ్ పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకునిగా కూడా సుపరిచితులు. ఈయన తల్లి గల్లా అరుణ కుమారి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబరుగా వ్యవహరిస్తున్నారు. తండ్రి గల్లా రామచంద్ర నాయుడు గతంలో ఏపీ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనే అమర్ రాజా బ్యాటరీస్‌‌కు వ్యవస్థాపకులు. జయదేవ్ తాతయ్య పాతూరి రాజగోపాల నాయుడు స్వాతంత్ర్య సమరయోధునిగా, పార్లమెంటేరియన్‌గా కూడా సుపరిచితులు.

Trending News