టాలీవుడ్ కబుర్లు: ఏ హీరో చేతిలో ఎన్ని సినిమాలు ?

Last Updated : Jul 2, 2018, 06:38 PM IST
టాలీవుడ్ కబుర్లు: ఏ హీరో చేతిలో ఎన్ని సినిమాలు ?

సీనియర్లు, యంగ్ స్టర్స్ అనే తేడాలేకుండా హీరోలంతా మినిమం రెండేసి సినిమాలతో చెలరేగిపోతున్నారు. ఒకరిద్దరు స్టార్స్ మినహా అంతా మరో రెండేళ్ల వరకు ఫుల్ బిజీ. ప్రస్తుతం ఏ హీరో చేతిలో ఎన్ని సినిమాలున్నాయో చూద్దాం. ఈ లిస్ట్ లో ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.


మహేష్ బాబు
ప్రస్తుతం ఈ హీరో చేతిలో ముగ్గురు దర్శకులున్నారు. వీళ్లలో వంశీ పైడిపల్లి సినిమా మరో 4 రోజుల్లో సెట్స్ పైకి వస్తుంది. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తాడు మహేష్.

 

 

ఎన్టీఆర్
వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ఏకంగా క్రేజీ దర్శకుల్ని లైన్లో పెట్టాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత అనే సినిమా చేస్తున్న యంగ్ టైగర్.. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు. ఈ హీరో లిస్ట్ లో కొరటాల శివ కూడా ఉన్నాడు.

ప్రభాస్
చేసేవి తక్కువ సినిమాలైనా భారీగా ఉండాలనే కాన్సెప్ట్ తో ఉన్నాడు ప్రభాస్. అందుకే బాహుబలి-2 తర్వాత పూర్తిగా సాహోకు మాత్రమే ఫిక్స్ అయిపోయాడు. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తర్వాత.. రాధాకృష్ణ కుమార్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడు.


రామ్ చరణ్
చెర్రీ కూడా స్పీడ్ పెంచాడు. మొన్నటివరకు ఒక సినిమా తర్వాత ఇంకో మూవీ చేస్తూ వచ్చిన మెగాపవర్ స్టార్ ఈసారి ఒకేసారి 2 సినిమాల్ని పూర్తిచేయాలనుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న చరణ్.. త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి ఓ మూవీని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత కొరటాలతో ఓ మూవీ ఉంటుంది.

 

నాగచైతన్య
నాగచైతన్య లిస్ట్ లో కూడా ముగ్గురు దర్శకులున్నారు. ప్రస్తుతం చందు మొండేది దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్న ఈ అక్కినేని యువసామ్రాట్.. సైమల్టేనియస్ గా మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు అనే మరో సినిమా కూడా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే శివ నిర్వాణ
దర్శకత్వంలో చైతూ-సమంత హీరోహీరోయిన్లుగా సినిమా ఉంటుంది.

చిరంజీవి
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. వీటితో పాటు బోయపాటి, సుకుమార్ కూడా చిరంజీవి లిస్ట్ లో ఉన్నప్పటికీ.. ఆ ప్రాజెక్టులపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు


నాగార్జున
నాగార్జున కూడా అస్సలు స్పీడ్ తగ్గించడం లేదు. రీసెంట్ గా ఆపీసర్ సినిమాను రిలీజ్ చేసిన నాగ్.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ ఉంది. బంగార్రాజు అనే ప్రాజెక్టుపై వీళ్లిద్దరూ దాదాపు ఏడాదిగా చర్చలు జరుపుతూనే ఉన్నారు.


నాని
ఏడాదికి 3 సినిమాలు చేయాలనే టార్గెట్ తో దూసుకుపోతున్న నాని కూడా ముగ్గురు డైరక్టర్లను లైన్లో పెట్టాడు. రీసెంట్ గా కృష్ణార్జున యుద్ధం సినిమాను రిలీజ్ చేసిన ఈ హీరో, తన నెక్ట్స్ ప్రాజెక్టును ఇంకా ఎనౌన్స్ చేయలేదు. దర్శకుడు హను రాఘవపూడితో కలిసి ఈ హీరో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు తన క్లోజ్ ఫ్రెండ్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. వీటిలో ఏదో ఒకటి కన్ ఫర్మ్ అయ్యేలోపు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడు ఈ నేచురల్ స్టార్.


రవితేజ
సినిమా హిట్టా, ఫ్లాపా అనే విషయం రవితేజకు అనవసరం. పక్కాగా ఓ సినిమా కంప్లీట్ చేశామా లేదా అనేదే మాస్ రాజాకు ఇంపార్టెంట్. రీసెంట్ గా నేలటిక్కెట్టు సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చిన ఈ హీరో, ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్-అక్బర్-ఆంటోనీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ హీరో లిస్ట్ లో ప్రస్తుతానికి సంతోష్ శ్రీనివాస్, వీఐ ఆనంద్ ఉన్నారు. వీళ్లతో కూడా త్వరలోనే సినిమాలు చేయబోతున్నాడు


బాలకృష్ణ
చకచకా సినిమాలు చేసే బాలయ్య కూడా ముగ్గురు దర్శకుల్ని లైన్లో పెట్టారు. త్వరలోనే క్రిష్ డైరక్షన్ లో ఎన్టీఆర్ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్న నటసింహం.. ఆ మూవీ కంటే ముందే వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు బోయపాటితో ఓ సినిమా ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉంది.

అల్లు అర్జున్
నా పేరు సూర్య సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చిన అల్లు అర్జున్, ఇప్పటివరకు తన నెక్ట్స్ ప్రాజెక్టు ఎనౌన్స్ చేయలేదు. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా గతంలో అనుకున్నప్పటికీ అది ఆగిపోయింది. స్టయిలిష్ స్టార్ లిస్ట్ లో ఇప్పుడు విక్రమ్ కుమార్ మాత్రమే మిగిలాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చిన్న ఫారిన్ ట్రిప్ లో ఉన్నాడు. ఆ హాలిడే ట్రిప్ పూర్తయిన వెంటనే కొత్త సినిమా సంగతి తేలిపోతుంది.


వెంకటేష్
గురు తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీ కూడా ఒకేసారి ముగ్గురు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వచ్చే ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు వెంకీ. ఈ గ్యాప్ లో అనీల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ పూర్తిచేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు బాబి దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేసే ఆలోచనలో ఉన్నాడు వెంకటేష్.

 

@ జీ సినిమాలు

Trending News