శ్రీదేవి అంత్యక్రియలకు సంబంధించిన షెడ్యూల్

నటి శ్రీదేవి అంత్యక్రియలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.

Last Updated : Feb 28, 2018, 10:35 AM IST
శ్రీదేవి అంత్యక్రియలకు సంబంధించిన షెడ్యూల్

ముంబై: శ్రీదేవి డెడ్ బాడీ తీసుకెళ్లేందుకు దుబాయ్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు రాత్రి శ్రీదేవి భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను ఆమె కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. రేపు జరిగే శ్రీదేవి అంత్యక్రియలు వివరాలు ఇలా ఉన్నాయి.

*  అభిమానుల సందర్శనార్థం ఉ.9.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఉంచుతారు. 
* మధ్యాహ్నం 2 గంటల నుంచి అంతిమ యాత్ర  ప్రారంభం
* మధ్యాహ్నం 3.30 గంటల నుంచి విలే పార్లే సేవా సమాజ్‌ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు 

Trending News