జనం కోరుకున్న తెలంగాణ ఇది కాదు : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది కాదు అని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 

Last Updated : Feb 27, 2018, 01:21 PM IST
జనం కోరుకున్న తెలంగాణ ఇది కాదు : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది కాదు అని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏవీ అమలుకాలేదు. పైగా తెలంగాణలో అభయహస్తం పెన్షన్ పథకాన్ని కేసీఆర్ గతేడాదే పూర్తిగా నిలిపివేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర సోమవారం చేవెళ్లలో ప్రారంభమైన సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అవినీతి పెరుగుతోంది. విద్యుత్ ప్రాజెక్ట్‌ల పేరుతో రాష్ట్రంలో యధేచ్చగా ప్రజాధనం దోపిడీ జరుగుతోంది అని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు చేకూర్చే లబ్ధి గురించి మాట్లాడుతూ.. "ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్‌‌ను పాత డిజైన్ ప్రకారం నిర్మించి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు అందిస్తాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం" అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. అంతేకాకుండా నిరుద్యోగ యువకులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 

Trending News