చినబాబు సక్సెస్ మీట్‌కు..ఆటోలో కార్తీ

తమిళ హీరో కార్తీ తాజాగా న‌టించిన చిత్రం చిన‌బాబు.

Last Updated : Jul 17, 2018, 02:29 PM IST
చినబాబు సక్సెస్ మీట్‌కు..ఆటోలో కార్తీ

తమిళ హీరో కార్తీ తాజాగా న‌టించిన చిత్రం చిన‌బాబు. ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై సక్సెస్ టాక్ అందుకుంది. 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పట్టణాల్లో ప్రచారం చేస్తున్న కార్తీ.. సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. అయితే హైదరాబాద్‌లో హీరో కార్తీ సాధారణ వ్యక్తిలా ఆటోలో ప్రయాణించడం సినీ అభిమానులను ఆశ్చర్యపరిచింది.

హైద‌రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిన్న ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌కు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన, నిర్మాత రవీందర్‌రెడ్డితో కలిసి కారులో బయలుదేరారు. మాదాపూర్ నుంచి ప్రసాద్ ల్యాబ్‌కు వెళ్తున్న సమయంలో మాదాపూర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా సేపు వేచి చూసినా.. ట్రాఫిక్ క్లియర్ కాకపోవడం..చివరికి కారు నుంచి ఆటోలోకి మారి ప్రసాద్ ల్యాబ్స్‌కు చేరుకుని 'చినబాబు' సక్సెస్ మీట్ కు హాజరయ్యారు. కార్తీ ఆటోలో వెళ్లడాన్ని ఫోటోలు తీసిన కొందరు అభిమానులు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

చినబాబు సక్సెస్ మీట్‌కు..ఆటోలో కార్తీ

సక్సెస్ మీట్ కు హాజరైన కార్తీ.. 'చినబాబు' సినిమాను సూపర్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమాను మెచ్చుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు  ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు కార్తీ.

Trending News