వైఎస్ఆర్ వర్ధంతి: ‘యాత్ర’ నుంచి తొలి సాంగ్ రిలీజ్..

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి  నేడు (సెప్టెంబర్ 2).

Last Updated : Sep 2, 2018, 02:07 PM IST
వైఎస్ఆర్ వర్ధంతి: ‘యాత్ర’ నుంచి తొలి సాంగ్ రిలీజ్..

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి  నేడు (సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'యాత్ర' మూవీ నుంచి తాజాగా 'సమరశంఖం' అనే లిరికల్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇప్ప‌టికే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్‌ను, టీజర్‌ను విడుద‌ల చేసిన మూవీ యూనిట్.. కొద్దిసేపటి క్రితమే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ గీతాన్ని కాలభైరవ ఆలపించగా.. కెకె సంగీతం సమకూర్చాడు.
 
ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. వైఎస్ఆర్ పాత్రలో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. జగన్ పాత్రలో సూర్య, సూరీడు పాత్రలో పోసాని, సబితా ఇంద్రారెడ్డిగా సుహాసినీ కనిపించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో జగపతిబాబు, రావు రమేష్, అనసూయ త‌దిత‌రులు కూడా న‌టిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు మహి వి రాఘవ్ కాగా.. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు నిర్మాత‌లు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్‌ను మీరూ వినండి..

Trending News