30-30-30 Rule For Weight Loss In 9 Days: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తింటున్నారు. దీని కారణంగా సులభంగా బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడం కారణంగా చాలా మంది తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలు, వ్యాయామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు 30-30-30 నియమాన్ని పాటించడం వల్ల సులభంగా..ఆరోగ్యంగా బరువు తగ్గుతారని ప్రముఖ డైటీషియన్లు తెలుపుతున్నారు. అయితే ఈ నియమమం ఏంటో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కేలరీలు బర్న్ కోసం..
బరువు తగ్గడానికి తప్పకుండా కేలరీలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కేలరీలను బర్న్ చేసుకోవడానికి ప్రతి రోజు ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. రోజువారి ఆహారాల్లో 30 శాతం కేలరీలు తగ్గించుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఆహరంలో నీటిని అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
ఆహారాన్ని నెమ్మదిగా నమలాల్సి ఉంటుంది:
ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో, సరిగ్గా నమలడం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎక్కువగా నమలడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఆహారాన్ని తప్పకుండా 30 నిమిషాల పాటు నమలాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడానికి ఆహారాలు ఎక్కువగా నమలకపోవడం కూడా ఒక రీజనేనని డైటీషియన్లు చెబుతున్నారు. ఎక్కువగా టీవీలు చూస్తు తినడం వల్లే చాలా మంది బరువు కూడా పెరుగుతున్నారన్నారు. రాత్రి భోజనం లేదా అల్పాహారం కోసం తప్పకుండా ప్రత్యేక సమయం కేటాయించడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చన్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా పై చిట్కాను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
వ్యాయామం చేయండి:
బరువు తగ్గడానికి..క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం చాలా మంచిది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు 30 నిమిషాల పాటు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరక శ్రమ చేయడం వల్ల ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటారు. కాబట్టి ప్రతి రోజు 30 నిమిషాల పాటు జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం