జిమ్ వ్యాయామం కన్నా ఏరోబిక్స్ మిన్న: WHO ప్రకటన

Last Updated : Nov 27, 2017, 03:53 PM IST
జిమ్ వ్యాయామం కన్నా ఏరోబిక్స్ మిన్న: WHO ప్రకటన

ప్రతీ రోజు జిమ్ కు వెళ్లి అవే సాధారణ వ్యాయామాలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని, దానితో పాటు ఆరోగ్యం మీద శ్రద్ద కనబరిచే వ్యక్తులు, క్రీడాకారులు  కండరాలను పటిష్టముగా ఉంచుకొనే దశలో తప్పకుండా ఏరోబిక్స్ వైపు కూడా దృష్టి కేంద్రీకరించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఏరోబిక్స్ చేయడం వలన లెక్కలేనన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిపింది. వాటి వివరాలు ఇవి

* ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 30 నిముషాలు  ఏరోబిక్స్ చేయడం వలన కేవలం అయిదు సంవత్సరాల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరణాల శాతం దాదాపు 12 శాతం తగ్గే అవకాశం ఉంది. 

*  దాదాపు 170 దేశాల్లో 130,000 మంది వ్యక్తులను సర్వే చేసిన WHO, ఏరోబిక్స్ చేసేవారిలో హృద్రోగ వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ధృవీకరించింది. 

*  ప్రతీ ఒక్కరు కనీసం వారానికి 150 నిమిషాల పాటు సాధారణ స్థాయిలో ఏరోబిక్స్ లేదా 75 నిమిషాల పాటు పూర్తి స్థాయి ఏరోబిక్స్ చేయడం వలన తమ ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చని తెలిపింది. 

Trending News