Almonds Health Benefits: బాదం.. పోషకాలకు పవర్‌హౌజ్.. ప్రతిరోజూ 4 తింటే ఈ షాకింగ్‌ రిజల్ట్స్‌ మీ సొంతం..

Almonds Health Benefits: ప్రతిరోజు నాలుగు బాదం పప్పులు తింటే నమ్మలేని ఈ ఆరు ప్రయోజనాలు పొందుతారు. బాదం లో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి ఫైబర్, ప్రోటీన్  కావాల్సిన పోషకాలు అందుతాయి.

Written by - Renuka Godugu | Last Updated : May 2, 2024, 07:07 PM IST
Almonds Health Benefits: బాదం.. పోషకాలకు పవర్‌హౌజ్.. ప్రతిరోజూ 4 తింటే ఈ షాకింగ్‌ రిజల్ట్స్‌ మీ సొంతం..

Almonds Health Benefits: ప్రతిరోజు నాలుగు బాదం పప్పులు తింటే నమ్మలేని ఈ ఆరు ప్రయోజనాలు పొందుతారు. బాదం లో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి ఫైబర్, ప్రోటీన్  కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ అనే ఖనిజాలు కూడా ఉంటాయి. పోషకాలకు పవర్ హౌస్ బాదాం దీంట్లో ఉండే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. చెలు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచే గుణాలు ఉంటాయి..ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి అంతేకాదు బాదాం లో  యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ డామేజ్ నుంచి కాపాడి గుండె సమస్యలు ప్రాణాంతక క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.

బరువు తగ్గుదల
బాదం మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి అంతేకాదు ఎక్కువ సమయం ఆకలి వేయదు దీని మన శరీరానికి కావలసిన పోషకాలు బాదంతోనే అందుతాయి ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అంతేకాదు ఇది అన్సాచ్యురేటెడ్ కొవ్వులు కలిగి ఉండడం అని ఎన్ ఐ హెచ్ తెలిపింది

మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది..
ప్రతిరోజు నానబెట్టిన నాలుగు బాదం గింజలను తినడం వల్ల మనలో గుండెకు సంబంధించిన కార్డియా వాస్క్యులర్ ప్రమాదం దాదాపు 28% తగ్గుతుంది.

చర్మ ఆరోగ్యం..
బాదం లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని గ్రహిస్తాయి బాదం లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండటం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంతేకాదు  విటమిన్ ఇ మన చర్మాన్ని ఒక షీల్డ్ లా కాపాడుతుంది సన్ డ్యామేజ్ అవ్వకుండా రక్షిస్తుందని ఎన్ ఐ హెచ్ తెలిపింది.

ఇదీ చదవండి: ఈ ఎరుపురంగు ఆహారాలు తింటే మీకు స్ట్రోక్‌ రాకుండా కాపాడతాయి..

డయాబెటిస్ కంట్రోల్..
బాదంను రెగ్యులర్‌గా మన ఆహారంలో చేర్చుకుంటే ఎంతో మంచిది.  డైటరీ ఫైబర్ అధికంగా ఉండే బాదం తీసుకోవడం వల్ల మన శరీరంలో డయాబెటిస్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇందులో మెగ్నీషియం మోనోసాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ విటమిన్ ఈ కూడా డయాబెటిస్ రోగులకు అందుతుంది దీంతో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

ఇదీ చదవండి: ఈ 5 సూపర్‌ ఫుడ్స్ పాడైన లివర్‌ను సైతం బాగుచేస్తాయట..!

కంటి ఆరోగ్యం
తరచూ ప్రతిరోజు బాదంని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులోని ఆమ్ప్లి ఇన్ఫర్మేటరీ యాంటీ ఆక్సిడెంట్ మన కంటిని కాపాడతాయి. ఇందులో జింక్ కేరోటేనాయిడ్స్ విటమిన్ సి, ఈ ,ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇది ఇన్ల్ఫమేటరీ, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మన కళ్ళను కాపాడి కంటి చూపులు మెరుగుపరుస్తుందని హెచ్ ఐఏ తెలిపింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News