సీతాఫలం.. అద్భుత ప్రయోజనాలు

Last Updated : Oct 21, 2017, 04:16 PM IST
సీతాఫలం.. అద్భుత ప్రయోజనాలు

సీజన్ వస్తోందంటే కొన్ని రకాల పండ్ల రుచి పదే పదే గుర్తొస్తోంది. అలాంటి కోవకే చెందినది సీతాఫలం (కస్టర్డ్ ఆపిల్). శీతాకాలం పండు/ చలికాలం పండు అని దీనిని పిలుస్తారు. దేశంలో వివిధ ప్రాంతాలలో సీతాఫలం సాగు జరుగుతున్నా, తెలంగాణలోని మహబూబ్ నగర్ మనకు ఠక్కున గురొచ్చే ప్రాంతం.  హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుండే సరఫరా అవుతుంది. 

సీతాఫలం సీజన్లో రోజుకు ఒకటితిన్నా.. అందులోని ఔషధగుణాలు మన శరీర రోగాలను నివారిస్తుంది. పండే కాదు.. దాని ఆకులు, బెరడు ఇలా అన్నీ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారట. సీతాఫలం తినటం వల్ల ఎటువంటి ప్రయోజనాల ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

* ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది. ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. 

* సీతాఫలం పండు గుజ్జును తీసుకుని రసంలా చేసి.. పాలు కలిపి.. పిల్లలకు తాగించాలి. సత్వర శక్తి లభిస్తుంది. 

* ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి, రెండు పండ్లు తినిపిస్తే మంచిది. ఇందులోని ఫాస్పరస్‌, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి. సల్ఫర్‌ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది. మెగ్నీషియం శరీర కండరాలకు విశ్రాంతినిస్తుంది. 

* మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. రోజూ తినగలిగితే.. ఎంతో మార్పు కనిపిస్తుంది. 

* హృద్రోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. 

 * ఒక్క సీతాఫలం పండే కాదు.. ఆకులు, బెరడు కూడా ఉపయోగపడతాయి. చాలామంది సెగ్గడ్డలకు వీటి ఆకుల్ని నూరి కడతారు. బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు. 

* సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.

Trending News