Amla Juice Benefits: చర్మ సౌందర్యం, ఆరోగ్యమైన జుట్టు కోసం ఈ జ్యూస్ తప్పనిసరిగా తాగండి!

Amla Juice Benefits: ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. దీని తినడం వల్ల చర్మంతో పాటు జుట్టును కూడా సంరక్షించుకోవచ్చు. అయితే ఉసిరికాయ జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 01:11 PM IST
Amla Juice Benefits: చర్మ సౌందర్యం, ఆరోగ్యమైన జుట్టు కోసం ఈ జ్యూస్ తప్పనిసరిగా తాగండి!

Amla Juice Benefits: వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బలు, చర్మంపై మెరుపు తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. చర్మంపై ఏర్పడే చెమట కారణంగా దుమ్ము పేరుకుపోవడం వల్ల చర్మంపై మెరుపు తగ్గిపోతుంది. అయితే ఇలాంటి సౌందర్య సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఉసిరి కాయల రసం ఎంతో సహకరిస్తుంది. అయితే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. 

ఉసిరి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఉసిరికాయ.. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పండు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఐరన్, విటమిన్ సి కి ఇది గొప్ప మూలం. ఇది ముఖంపై మెరుపును తీసుకొచ్చేందుకు సహకరిస్తుంది. దీంతో పాటు జుట్టును సంరక్షిస్తుంది. దీంతో పాటు బరువు తగ్గడం సహా శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు సహకరిస్తుంది. 

ఉసిరి రసం కోసం కావాల్సిన పదార్థాలు..

- 10 ఉసిరి కాయలను ఎంచుకోవాలి.

- 4 నుంచి 5 టీస్పూన్ల చక్కెర

- పావు టీస్పూన్ అయోడిన్ ఉప్పు

- పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి

- కొన్ని ఐస్ క్యూబ్స్

ఉసిరి రసం ఎలా తయారు చేయాలి?

ఉసిరి కాయలను బాగా శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోని గింజలన్నీ తీసేయాలి. ఇప్పుడు ఈ ముక్కలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో చక్కెర, ఉప్పు, నీరు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు గ్లాసులో వేసి అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి డ్రింక్ ఇవ్వండి.

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  

Also Read: Male Fertility: పురుషుల్లో సంతానోత్పత్తి పెరిగేందుకు ఈ నట్స్ తినండి!

Also Read: Weight Loss Drinks At Home: లెమన్ వాటర్‌ను తాగుతున్నారా..అయితే ఈ ప్రయోజనాన్ని తెలుసుకోండి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News