Banana For Breakfast: బిజీ లైఫ్ కారణంగా చాలా మందికి ఆఫీసుకు వెళ్లే క్రమంలో తొందర తొందరగా అల్పాహారం తీసుకుంటారు. చాలా మంది క్విక్‌గా తయారు చేసుకుని తింటున్నారు. అయితే ఈ క్రమంలో బ్రెడ్ అండ్ బటర్ లేదా అరటిపండు తినడానికి ఇష్టపడుతున్నారు. వీటిని తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారంలో శరీరానికి ఆరోగ్యాన్ని అందించే ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉదయం తీసుకునే టిఫిన్‌లో ఎందుకు అరటిపండును తినొద్దో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్కామైండ్ డైట్‌ను రూపొందించిన డాక్టర్ డారిల్ జోఫ్రే అభిప్రాయం ప్రకారం..అరటిపండ్లు అల్పాహారంగా తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అనేక పోషకాలు ఉన్నప్పటి ఉదయం అల్పాహారంలో వీటిని తినడం మంచిది కాదని అన్నారు.
అల్పాహారంలో అరటిపండు ఎందుకు తినకూడదో తెలుసా?:
అరటిపండులో 25 శాతం చక్కెరతో పాటు, యాసిడ్ పరిమాణాలు లభిస్తాయి. అల్పాహారం సమయంలో అరటిపండ్లు తినడం వల్ల తాత్కాలికంగా బలం మాత్రమే లభిస్తుంది. దీంతో మీరు త్వరగా అలసిపోయి ఆకలితో ఉంటారు. అరటిపండ్లను తినడం వల్ల కోరికలు కూడా పెరుగుతాయి.
అల్పాహారంలో అరటిపండు మాత్రమే తినడం హానికరమని నిపుణులు తెలుపుతున్నారు. అరటి పండ్లను ప్రతి రోజు అల్పాహారంలో కాకుండా సాయంత్రం స్నాక్స్‌గా తినడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. మధుమేహంతో బాధపడుతున్నవారు వీటిని ఉదయం పూట తినడం వల్ల ఇన్సులిన్ పరిమాణాలు కూడా సులభంగా పెరుగుతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర పరిమాణాలు క్రమంగా పెరుగుతాయి. కాబట్టి ప్రతి రోజూ అల్పాహారంలో బాదం, చియా గింజలను ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.
అల్పాహారంలో వీటిని తినండి:
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి అల్పాహారం అతి ముఖ్యమైన భోజనం. రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలంటే అల్పాహారం మిస్ చేయకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఉదయం టిఫిన్‌లో భాగంగా తప్పకుండా ఓట్స్ లేదా గంజి తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల మీరు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి