Benefits of Tulsi in Acidity: అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా నిమిషంలో విముక్తి పొందండి..!!

Benefits of Tulsi in Acidity: తులసి మొక్కను ఇళ్లలో లభించే ఓ సాధరణమైన మొక్క. ఇందులో ఉండే గుణాలు వ్యాధుల నుంచి సంరక్షించేందుకు ఎంతగానో కృషి చేస్తుంది. ముఖ్యంగా ఎసిడిటీ వంటి సమస్యల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 11:56 AM IST
  • అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా..
  • తులసి మొక్కలను ఉపయోగించి విముక్తి పొందండి
  • తులసి కషాయం అసిడిటీ నుంచి నిమిషాల్లో ఉపశమనం కలిగిస్తుంది
Benefits of Tulsi in Acidity: అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా నిమిషంలో విముక్తి పొందండి..!!

Benefits of Tulsi in Acidity: తులసి మొక్కను ఇళ్లలో లభించే ఓ సాధరణమైన మొక్క. ఇందులో ఉండే గుణాలు వ్యాధుల నుంచి సంరక్షించేందుకు ఎంతగానో కృషి చేస్తుంది. ముఖ్యంగా ఎసిడిటీ వంటి సమస్యల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపించి శరీరాన్ని దృఢంగా చేస్తుంది. శరీరంలో నొప్పుల సమస్యలను దూరం చేస్తుంది. అయితే ఎసిడిటీ తీవ్రంగా ఉన్నవారు తులసిని ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ చెప్పుకుందాం..

అసిడిటీని నుంచి ఉపశమనం పొందడానికి  తులసిని ఈ విధంగా ఉపయోగించండి

తులసి ఆకులు:

ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు తులసి ఆకులను తీసుకుని విముక్తి పొందవచ్చు. దీని కోసం 5 తులసి ఆకులను నమిలి నీరు త్రాగాలి. ఇలా క్రమం తప్పకుండా తినడం వల్ల ఎసిడిటీ సమస్య దూరమవుతాయి.

తులసి కషాయం:

ఎసిడిటీ సమస్యను అధిగమించడానికి.. తులసితో తయారు చేసిన కషాయాన్ని తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది పొట్టలో సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీని కోసం.. తులసి ఆకులు, లవంగాలు మెత్తగా చేసి వేడి నీటిలో వేసి మరిగించాలి. ఇప్పుడు చిక్కగా అయ్యాక ఆ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి తాగాలి.

తులసి చూర్ణం:

ప్రజలు తులసి పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. ఇది ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. తులసి పొడిని ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి అజ్వైన్, ఫెన్నెల్, లవంగాలను తులసి గింజలు, ఎండిన ఆకులతో కలిపి తీసుకోవచ్చు.

తులసి నీరు:

పొట్టలో సమస్యలతో బాధపడుతున్న వారు.. తప్పకుండా తులసితో తయారు చేసిన తులసి నీరు ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం తులసి ఆకులను నీటిలో ఉడకబెట్టి, ఆపై నీటిని ఫిల్టర్ చేసి.. క్రమం తప్పకుండా తాగాలి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా

Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News