Health Tips For Women: వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? ఈ ఆరోగ్య సూత్రాలు మీకోసమే..

Health Tips For Women: ఇంటి నుంచి పని చేస్తూ.. ఆరోగ్యంపై శ్రద్ద చూపలేకపోతున్నారా? ఫిట్​గా ఉండేందుకు ఎలాంటి డైట్​ ఫాలో కావాలి? ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు? అనే విషయాలపై న్యూట్రీషన్స్ చెబుతున్న ఆరోగ్య సూత్రాలు మీ కోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2021, 09:18 AM IST
Health Tips For Women: వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? ఈ ఆరోగ్య సూత్రాలు మీకోసమే..

Health Tips For Women: వర్క్​ ఫ్రం హోం ప్రస్తుతం సర్వ (Work From Home) సాధారణమైంది. కరోనా భయాల నేపథ్యంలో ఎక్కువ మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మహిళలు ఇంటి నుంచే పని చేయడం వల్ల ప్రయాణాలు చేసే సమయం తగ్గింది. అయితే ఇదే సమయంలో ఇంట్లో బాధ్యలు మాత్రం రెట్టింపయ్యాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇంట్లో నుంచి పని చేస్తున్నా.. పని ఒత్తిడి, వర్క్​ డెడ్​లైన్స్​, పిల్లల ఆన్​లైన్ క్లాస్​లు, ఇంట్లో ఇతర పనులు, సమయానికి తినకపోవడం వంటివి వాటి వల్ల మహిళల ఆరోగ్యంపై ప్రతికూల (Women health) ప్రభావం పడుతుందనేది ఈ నివేదికల సారాంశం.
మరి ఆలాంటి మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా మహిళలు ఆరోగ్యంగా, ఫిట్​గా ఉండొచ్చు? అనేది ఇప్పుడు చూద్దాం.

ఇమ్యూనిటీ పెంచుకోవాలి..

ఇంటి నుంచి పని చేస్తున్న మహిళలు ఇమ్యూనిటీ (రోగ నిరోధక శక్తి) పెంచుకోవడం చాలా ముఖ్యం. సరైన డైట్​ ఫాలో (Diet for Women) అవడమొక్కటే ఇమ్యూనిటీని పెంచుకునే మార్గమని వైద్యులు చెబుతున్నారు.

బ్యాలెన్సింగ్ మీల్స్​(Best Meals)..

తీసుకునే ఆహారంలో అన్ని సమపాలలో ఉండేలా చూసుకోవాలి. తృణధాన్యాలు, మిల్లెట్స్​, పప్పులు, గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులతో పాటు పండ్లూ, ఆకు కూరలు, కూరగాయలు అన్నింటిని తరచుగా తీసుకోవాలి. ఒకే విధమైన ఆహారాన్ని తరచు తీసుకోకుడదని వైద్యులు సూచిస్తున్నారు.

బ్రేక్​ ఫాస్ట్ ఎక్కువ తీసుకోవాలి..

బ్రేక్ ఫాస్ట్ అనగానే చాలా మంది తక్కువగా తినాలని చెబుతుంటారు. అయితే వైద్యులు మాత్రం కడుపునిండే వరకు బ్రేక్​ ఫాస్ట్ తినొచ్చని (How Should The Breakfast Diet Be) చెబుతున్నారు. ఇడ్లి, దోశ, వెజ్ శాండ్​విచ్​, దాల్​ విత్​ వెజ్​ పరోటా, ఉప్మా, గుడ్లు, పాలు, ఓట్స్​ వంటివి ఉదయాన్నే తినడం వల్ల.. శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్​ ఫాస్ట్​ తినడం మానొద్దని చెబుతున్నారు.

ఒత్తిడిగా అనిపిస్తే ఇవి తినాలి..

ఎప్పుడైనా ఒత్తిడిగా ఉన్నా.. పని పెరిగినా ఆకలిగా అనిపించడం సాధారణంగా జరుగుతుంది. అలాంటప్పుడు పండ్లు, నట్స్​ (బాదాం, పల్లి, కాజూ వంటివి) తినడం మంచింది. వీటి ద్వారా మంచి పోషకాలు అందటంతో పాటు.. ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం (A diet that relieves stress) పొందొచ్చని చెబుతున్నారు వైద్య విశ్లేషకులు.

లంఛ్​లో ఇవి తీసుకోవాలి..

శాకాహారులైతే.. మధ్యాహ్నం భోజనం (లంచ్​)లో చపాతి, అన్నం, కర్రీ, పప్పు, బీన్స్​ సలాడ్​, పెరుగు. వంటివి ఉండేలా చూసుకోవాలి.

మాంసాహారులైతే.. గుడ్లు, చేపలు, చికెన్ వీటిల్లో ఏదో ఒకటి (Food to take at lunch) ఎంచుకోవచ్చు.

సరైన ఆహారం మాత్రమే కాదు..

పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్యం మెరుగవదు. సరైన సమయంలో ఎంత తినాలి అనేది తెలిసుండాలి. ప్రతి రోజు అదే డైట్ ఫాలో అవ్వాలి. ఒకే పరిమాణంలో ప్రతి రోజు ఆహారం తీసుకోవాలి.

సాయంత్రాల్లో డైట్ ఇలా..

సరైన డైట్ ఫాలో అవ్వాలంటే.. టీ, కాఫీ బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, గ్రీన్​ టీ, నిమ్మరసం వంటివి తీసుకోవాలి. కూల్ డ్రింక్స్​ తాగకపోడమే మంచిదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

కొవ్వుతో కూడిన చిప్స్​, డీప్​ ఫ్రై స్నాక్స్​, బిస్కెట్ల వంటి వాటికి బదులు.. ఇంట్లోనే ముర్మురా భేల్, కార్న్​ చాట్ వంటివి చేసుకుని తినడం బెటర్ అంటున్నారు వైద్యులు.

డిన్నార్​ లైట్​గా..

డిన్నర్​ (రాత్రి భోజనం) తేలికపాటిదై ఉండాలని వైద్య నిపుణులు అంటున్నారు. పెరుగుతో వెజిటేబుల్ పులావ్​, సూప్​ వంటి వాటితో డిన్నర్ పూర్తి చేయడం మంచిదని (Food to take at Dinner) చెబుతున్నారు.

పడుకునే ముందు..

రాత్రి పడుకునే ముందు చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే అందులో చిటికెడు​ పసుపు వేసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేస్తే ప్రశాంతంగా నిద్ర పట్టడం సహా.. మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుందని అంటున్నారు.

ఎక్కువగా నీళ్లు తాగాలి..

డీ హైడ్రైషన్​ సమస్య వల్ల మగత, అలసట, కళ్లు లోపం వంటి  ఇబ్బందులకు దారి తీయొచ్చు. అందుకే తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. రాత్రి భోజనానికి ముందు కనీసం.. లీటర్ నీళ్లు తాగితే మంచింది.

Also read: Malaika Arora Yoga Tips: బెల్లీ ఫాట్ తగ్గించేందుకు మలైకా అరోరా చెప్పిన టిప్స్ మీరూ పాటించండి?

Also read: Peanuts Side Effects: డయాబెటిస్ (షుగర్) వ్యాధిగ్రస్తులు వేరుశనగ తినడం ఆరోగ్యానికి హానికరం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News