Skin Care Remedy: చలికాలం చర్మం కళ తప్పుతోందా, ఈ హోమ్ మేడ్ క్రీమ్ రాసి చూడండి

Skin Care Remedy: చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చలికాలం అనేది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని చిట్కాలతో చర్మ సంరక్షణ చేసుకోవచ్చు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 13, 2024, 11:27 PM IST
Skin Care Remedy: చలికాలం చర్మం కళ తప్పుతోందా, ఈ హోమ్ మేడ్ క్రీమ్ రాసి చూడండి

Skin Care Remedy: చలికాలంలో వాతావరణ ప్రభావం చర్మంపై ప్రతికూలంగా ఉంటుంది. చర్మం నిర్జీవంగా మారుతుంది. కళ తప్పుతుంది. మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తులు వాడే కంటే కొన్ని సులభమైన చిట్కాలతో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు. చర్మం నిగనిగలాడేట్టు చేయవచ్చు. ఈ టిప్స్ పాటిస్తే చర్మం మృదువుగా మార్చవచ్చు.

చలికాలంలో సహజంగా ఇమ్యూనిటీ తగ్గుతుంటుంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. దాంతోపాటు చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చర్మం గ్లో తప్పుతుంది. డ్రైగా ఉండవచ్చు. నిర్జీవంగా మారుతుంది. రసాయనాలతో నిండి ఉండే క్రీమ్స్ వాడకుండా కొన్ని సులభమైన చిట్కాలతో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. చలికాలంలో చర్మం మృదువుగా ఉండేందుకు , నిగనిగలాడేందుకు బీట్‌రూట్-అల్లోవెరా మిశ్రమం అద్బుతంగా పనిచేస్తుంది. అల్లోవెరాను చాలామంది చర్మ సంరక్షణలో ఎప్పటి నుంచో వినియోగిస్తున్నారు. బీట్‌రూట్ కలిపితే అద్భుతమైన హోమ్ మేడ్ క్రీమ్ తయారవుతుంది. ఇది మీ చర్మాన్ని అత్యంత మృదువుగా మారుస్తుంది. 

అల్లోవెరా బీట్‌రూట్ క్రీమ్ తయారు చేసేందుకు 2 చెంచాల బీట్‌రూట్ రసం, 2 చెంచాల అల్లోవెరా జెల్ కావాలి. ముందుగా బీట్‌రూట్ గ్రైడ్ చేసి రసం తీయాలి. దాంతో పాటు అల్లోవెరా మొక్కను ఫ్రెష్‌గా అల్లోవెరా జెల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటినీ బాగా కలుపుకోవాలి. అంతే హోమ్ మేడ్ క్రీమ్ రెడీ అయినట్టే. ముందుగా ముఖాన్ని బాగా శుభ్రం చేసుకుని క్రీమ్ రాసుకోవాలి. 5-10 నిమిషాలు మస్సాజ్ చేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి. 

బీట్‌రూట్‌లో ఉంటే విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, సోడియం వంటివి శరీరానికి చాలా మేలు చేకూరుస్తాయి. దాంతోపాటు ఇందులో ఇతర పోషకాలు చాలా ఉంటాయి. సహజసిద్దమైన స్కిన్ టోనర్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా ముఖంపై ఉండే పింపుల్స్, మచ్చలు తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అల్లోవెరా అనేది చర్మం హైడ్రేట్‌గా ఉండేట్టు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలతో పాటు లిగ్నిన్, సైపోనిన్, ఎంజైమ్స్, సైలిసిలిక్ యాసిడ్ , ఎమైనో ఆసిడ్స్ కారణంగా మొటిమలు, మచ్చలు, ముడతలు, గీతలు అన్నీ తొలగిపోతాయి. అల్లోవెరాలో ఉండే యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి.

Also read: Hollywood Heroine: మహేశ్ అభిమానులకు గుడ్‌న్యూస్, రాజమౌళి సినిమా హీరోయిన్‌గా హాలీవుడ్ అందగత్తె

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News