Skin Care Remedy: కేశాల సంరక్షణకు మార్కెట్‌లో లభించే వివిధ రకాల కెమికల్ ఆదారిత ఉత్పత్తుల కంటే ప్రకృతిలో లభించే పదార్ధాలే అద్భుత ఫలితాలనిస్తాయి. మార్కెట్‌లో లభించే ఉత్పత్తులతో దుష్పరిణామాలు సంభవించవచ్చు. హెయిర్ కేర్ కోసం కొంతమంది అల్లోవెరా వాడితే, ఇంకొందరు ఉసిరి ఉపయోగిస్తుంటారు. రెండింట్లో ఏది బెస్ట్ అనేది చూద్దాం.
అల్లోవెరా వర్సెస్ ఉసిరిలో వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయి. హైడ్రేట్‌గా ఉండాలంటే అల్లోవెరా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఉసిరితో పోలిస్తే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ. జెల్ వంటి పదార్ధం కారణంగా కేశాలు మృదువుగా ఉంటాయి. నిగారింపు ఉంటుంది. అదే ఉసిరి అయితే ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ల కారణంగా కేశాల ఎదుగుదల బాగుంటుంది. కేశాల కుదుళ్లను పటిష్టంగా ఉంచుతుంది. జుట్టు విరగకుండా కాపాడుతుంది.
ఉసిరి, అల్లోవెరా రెండూ స్కాల్ప్ మంటను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. అయితే ఉసిరిలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు దురదను, డాండ్రఫ్‌ను తగ్గిస్తాయి. అల్లోవెరాలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా ర్యాషెస్, మంట తగ్గుతాయి. ఇక రెండింటినీ పోల్చి చూస్తే మాత్రం హెయిర్ గ్రోత్ కోసం ఉసిరి బెస్ట్ ఆప్షన్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కేశాలు మృదువుగా, నిగారింపుతో ఉండాలంటే అల్లోవెరా బెస్ట్. మన కేశాలకు ఏది అవసరమో దాన్ని బట్టి వినియోగించడం మంచిది. జుట్టు పొడుగ్గా ఎదగాలనుకుంటే ఉసిరి వాడటం మంచిది. అదే మృదువుగా, నిగనిగలాడుతుండాలంటే అల్లోవెరా మంచిది.
Also read: 8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.