Best Time for Vitamins: విటమిన్స్‌ సరైన సమయంలోనే తీసుకుంటున్నారా? ఒక్కసారి నిపుణుల సూచన ఏంటో తెలుసుకోండి..

Best Time for Vitamins: మన ఆరోగ్యకరమైన శరీరానికి విటమిన్స్‌, మినరల్స్‌ కచ్చితంగా తీసుకోవాలి. ఏదో తీసుకుంటున్నాం అన్నట్లుగా కాకుండా ప్రతి దానికి ఒక టైం ఉంటుంది.

Written by - Renuka Godugu | Last Updated : Apr 28, 2024, 08:27 AM IST
Best Time for Vitamins: విటమిన్స్‌ సరైన సమయంలోనే తీసుకుంటున్నారా? ఒక్కసారి నిపుణుల సూచన ఏంటో తెలుసుకోండి..

Best Time for Vitamins: మన ఆరోగ్యకరమైన శరీరానికి విటమిన్స్‌, మినరల్స్‌ కచ్చితంగా తీసుకోవాలి. ఏదో తీసుకుంటున్నాం అన్నట్లుగా కాకుండా ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకునే విటమిన్లకు కూడా ఓ సరైన సమయం ఉందట. మన శరీరంలో ఏ విటమిన్స్‌ తగ్గినా ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి. అదే విటమిన్స్‌ శాతం పెరిగినా కూడా ప్రమాదమే. అయితే, నిపుణుల సూచనతో సరైన మోతాదులో విటమిన్స్‌ సప్లిమెంట్స్‌ మీ డైట్లో చేర్చుకోవాలి. అదే విధంగా ఈ విటమిన్స్‌ సప్లిమెంట్స్ తీసుకోవడానికి కూడా సరైన సమయం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఆ సమయంలోనే సరైన ఫలితాలను ఇస్తాయట. అదేంటో తెలుసుకుందాం.

మల్టీవిటమిన్..
నిపుణుల అభిప్రాయం ప్రకారం మల్టీవిటమిన్ అనేది ప్రతి వయస్సు వారికీ కీలకం. అయితే, మల్టీవిటమిన్ తీసుకునేటప్పుడు వైద్యులను సంప్రదించి తీసుకోవాలి. ఉదాహారణకు గర్భవతులు ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్ మాత్రలు తీసుకుంటారు. పీరియడ్స్‌ వల్ల ఆడవాళ్లకు ఐరన్ తక్కువగా ఉంటుంది. అలాగే శాకహారులకు విటమిన్ బీ12 తక్కువగా ఉంటుంది. వీళ్లు వైద్యులను సంప్రదించి వాళ్లు సూచించిన సమయానికే మాత్రలు తీసుకోవాలి.సాధారణంగా మల్టీవిటమిన్లో బీ కాంప్లెక్స్ ఉంటుంది. 

విటమిన్స్‌ తీసుకోవడానికి సరైన సమయం ఏది?
విటమిన్ సీ..

విటమిన్ సీ మీ డైట్లో చేర్చుకుంటే కచ్చితంగా ఉదయం అల్పాహారం తీసుకున్నాకే చేర్చుకోండి.

ఒమేగా 3..
దీన్ని మధ్యాహ్నం లంచ్‌ అయ్యాక తీసుకోవాలి. ఒమేగా 3 ఫుడ్ తీసుకున్నాక గ్రహించే శక్తి పెరుగుతుంది. ఏ సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాకుండా ఉంటాయి.

ఐరన్..
ఐరన్ మాత్రలు మాత్రం ఖాళీ కడుపుతోనే వేసుకోవాలి. లేకపోతే మీరు తినడానికి ఒక గంట ముందు తీసుకోవాలి.

ఇదీ చదవండి: ఈ 5 ఆరోగ్యకరమైన గింజలు స్ట్రోక్‌ రాకుండా హార్ట్‌ బ్లాకేజీలను నివారిస్తాయి..

బీ కాంప్లెక్స్..
విటమిన్‌ బీ కాంప్లెక్స్‌ మొదటి హాఫ్‌ డేలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది నిద్ర రాకుండా చేస్తుంది.

కాల్షియం..
ఆహారం తీసుకున్నాక తీసుకోవాలి. విటమిన్ డీ ఉండే ఆహారాలు తిని వేసుకుంటే కాల్షియం గ్రహిస్తుంది.

మెగ్నీషియం..
మీరు రాత్రి పడుకోబోయే కనీసం 15 నిమిషాల ముందు వేసుకోవాలి. మంచి నిద్ర పడుతుంది కూడా.

ఇదీ చదవండి: బీరకాయను ఈ మండే ఎండలకు మీ డైట్లో చేర్చుకుంటే ఈ 12 ఆరోగ్య ప్రయోజనాలు..

ఐరన్, విటమిన్‌ సీ కలిపి తీసుకుంటే మరీ మంచిది. ఈ రెండు కలిసి బాగా పనిచేస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డీ, కే2 బోన్‌ ఆరోగ్యానికి పనిచేస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News